పెళ్లయ్యాక సమంత తెరపై కనపడుతుందా..?

ప్రేమ విషయం ప్రజలకు తెలిసే సరికే సినిమాలు తగ్గించేసింది సమంత. ఇప్పుడు ఇరు కుటుంబాల మధ్య పెళ్ళి చర్చలు కూడా సాగుతున్నాయి. దీనికి సమాంతరంగా ప్రేక్షకులలోనూ ‘సమంత పెళ్ళయ్యాక నటిస్తుందా’ అన్న చర్చ జరుగుతోంది. మరి దీనికి సమాధానం ఆమె మాటల్లోనే….

పరిశ్రమకొచ్చి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తోంది. మధ్యలో ఆరోగ్య సమస్యలతో తీసుకున్న కొంత గ్యాప్ తప్పితే ఎప్పుడూ చేతినిండా సినిమాలున్నాయి. నాకు నేనుగా సినిమాలు వదులుకోకూడదనే అనుకుంటున్నా. నా ఇష్టాలను ప్రోత్సహించే కుటుంబంలోకే వెళుతున్నా. అయితే పెళ్ళి తర్వాత ప్రేక్షకులు, దర్శకులు ఎలా ఆలోచిస్తారన్నది చూడాలి. వాళ్ళు వద్దు అనేవరకూ నటిస్తూనే ఉంటాను. ఈ ట్రెండ్ బాలీవుడ్లో ఉంది. ఇక్కడా జరిగితే బావున్నని మనసులో మాట బయటపెట్టింది అక్కినేని వారింట అడుగెట్టనున్న ఈ అందాల భామ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus