Samantha: సమంత ‘యశోద’ రాక డేట్‌ ఫిక్స్‌!

సమంత.. ఎక్కడ? గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఇదే మాట వినిపిస్తోంది. అంతకుమందు వినిపించే ‘సమంత సినిమా ఎప్పుడు?’ కాస్త ‘సమంత ఎక్కడ?’గా మారిపోయిందనే విషయమూ మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం రెడీ అవుతోంది. సమంత కొత్త సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. సమంత హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ ‘యశోద’ రిలీజ్‌ డేట్‌ టీమ్‌ ఫిక్స్‌ చేసింది. ఈ రోజు అనౌన్స్‌ చేస్తారు.

సమంత నుండి రాబోతున్న సినిమాల్లో ఆసక్తికరమైన సినిమా అంటే ‘శాకుంతలం’ అని చెప్పొచ్చు. ఆ తర్వాతి వరుసలో ఉన్న సినిమా ‘యశోద’. ఎందుకంటే ఈ రెండూ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలే. ఈ సినిమా విడుదల విషయంలో గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్‌డేట్‌లు లేకపోవడంతో.. ఏమైందా అనుకున్నారు. అయితే సినిమాను నవంబరు 11న విడుదల చేయాలని నిర్ణయించారట. ఈ మేరకు ఈ రోజు అనౌన్స్‌మెంట్‌ ఉండనుంది అని చెబుతున్నారు.

నిజానికి నవంబరు 4న ‘శాకుంతలం’ సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి పనులు జోరుగా సాగుతున్నాయి అని అంతా అనుకున్నారు. అయితే సినిమాను త్రీడీలో సిద్ధం చేస్తున్నామని, ఇంకాస్త టైమ్‌ పడుతుందని టీమ్‌ మొన్నీమధ్య వెల్లడించింది. దీంతో ప్రమోషన్స్‌ స్టాప్‌ చేసి కామ్‌గా ఉన్న ‘యశోద’ టీమ్‌ ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసింది. టీజర్‌ పోస్టర్లతో సందడి చేసింది. దీంతో నవంబరులోనే సినిమా అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే నవంబరు రెండో వారంలో సినిమా వస్తోంది.

‘యశోద’ సినిమాను తెలుగు, తమిళంలో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ రెండు భాషల్లో ఆమెనే డబ్బింగ్‌ చెప్పుకుంది. హరి-హరీష్ అనే ఇద్దరు కొత్త దర్శకులు రూపొందించిన ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ హక్కులు ఇప్పటికే అమ్మేశారు. అలాగే అమెజాన్‌ ప్రైమ్‌తో డీల్‌ అయిపోయిందట. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రచార చిత్రాలతో సినిమా ఓ పజిల్‌లా ఉంటుందని చెప్పకనే చెప్పింది టీమ్‌. మరి ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus