Samantha: ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంతకు మరో దెబ్బ!

కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సమంత (Samantha) పర్సనల్ లైఫ్ మాత్రం చాలా డిస్టర్బ్ గా ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగచైతన్యతో  (Naga Chaitanya)  విడాకుల అనంతరం ఆమెను సోషల్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోసింది. ఇన్నాళ్ల తర్వాత కూడా ఆమె పెట్టే పోస్టుల కింద అసభ్యకరమైన కామెంట్స్ వస్తుంటాయని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సమంత. అటువంటి సమంతకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇవాళ తుదిశ్వాస విడిచారు.

Samantha

గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన ఇవాళ కన్ను ముసారు. ఆయన్ని ఎప్పటికీ మిస్ అవుతాను అంటూ సమంత పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ హృదయాల్ని కదిలించింది. ఆమె అభిమానులందరూ ఆమెను ధృఢంగా ఉండమని వేలల్లో పోస్టులు, మెసేజులు పంపుతున్నారు. అయితే.. అక్కినేని ఇంట ఇవాళే పెళ్లి పనులు మొదలయ్యాయి.

మంగళ స్నానాలతో పెళ్లి తంతు ప్రారంభించిన అక్కినేని కుటుంబ సభ్యులెవరూ సమంత తండ్రి జోసెఫ్ ను చూసేందుకు హిందూ ధర్మం ప్రకారం రాకూడదు. మరి అక్కినేని కుటుంబ సభ్యులెవరైనా కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా రెస్పాండ్ అవుతారా లేదా అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus