తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన సమంత నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుంది. అక్కినేని కోడలిగా మారిన తర్వాత కూడా నటనే ప్రాణంగా బతుకుతోంది. కొత్త హీరోయిన్ మాదిరిగా కష్టపడుతోంది. ప్రయోగాత్మక పాత్రల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తోంది. ఆమె తాజాగా చేసిన మూవీ యూ టర్న్. ఇందులో జర్నలిస్ట్ రోల్ చేసింది. ఆ పాత్ర కోసం హెయిర్ ని కట్ చేసుకోవడమే కాదు.. సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. మరి ఎక్కువగా రెమ్యునరేషన్ అడిగి ఉండొచ్చనే అనుమానం కలగక మానదు. కానీ ఈ సినిమాకి సైన్ చేసే సమయంలో అతి తక్కువగా అడ్వాన్స్ మాత్రమే తీసుకుంది. లాభాలు వచ్చిన తర్వాత చూసుకుందామని చెప్పింది.
సాధారణంగా ఒక సినిమాకి 1.25 కోట్ల పైగా రెమ్యూనరేషన్ అందుకునే ఆమె ఇలా కనీస పారితోషికానికి సైన్ చేయడం కథపై ఆమె కున్న ఇష్టాన్ని తెలిపింది. ఆ ఇష్టం, నమ్మకం వృధా పోలేదు. ప్రేక్షకులు కూడా ఈ కథకి కనెక్ట్ అయ్యారు. హిట్ అందించారు. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వినాయకచవితి సందర్బంగా తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 13 న రిలీజ్ అయి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమా థియేటర్లోకి రాకమునుపే 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో సమంతకు 3.8 కోట్లను రెమ్యునరేషన్ గా ఇచ్చినట్టు తెలిసింది. సమంత కెరీర్ లో అతి తక్కువ రెమ్యునరేషన్ చిత్రంగా “యు టర్న్” నిలుస్తుందంటే ఆమె కెరీర్ లో బెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న మూవీగా నిలిచింది.