Naga Chaitanya: చైతు వైరల్‌ వీడియో… కుక్కను పట్టేసిన నెటిజన్లు… అది సమంతదేనా?

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని విడిపోయారనే విషయం తెలిసిందే. ఆ విడాకుల విషయంలోనూ, ఆ తర్వాత జరిగిన అంశాల విషయంలోనూ చాలా పెద్ద రచ్చే జరిగింది. ఒకరినొకరు ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్‌ కూడా చేసుకున్నారు. మొన్నీమధ్య ‘ఖుషి’ సినిమా విడుదల సమయంలోనూ, ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు అదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఇంత జరిగి అంతా ఓకే అయ్యింది అనుకుంటుండగా… ఇప్పుడు మళ్లీ అదే డిస్కషన్‌ మొదలైంది.

నిజానికి గత కొన్ని రోజులుగా అక్కడక్కడా వినిపిస్తున్న చిన్నపాటి పుకార్లకు ఊతం ఇచ్చేలా కొత్త పుకార్లు మొదలైంది. ఈసారి కారణం ఎవరి మాటనో, ఇంకెవరి చేతనో కాదు, ఓ కుక్క. అవును ఓ పెంపుడు శునకం వల్లే ఇప్పుడు మళ్లీ పుకార్లు వస్తున్నాయి. సమంత దగ్గర ఉన్న ఓ కుక్క లాంటిదే నాగచైనత్య దగ్గర కూడా కనిపించింది. దాంతో ఆ కుక్క ఇక్కడెలా, లేకపోతే అదే కుక్కనా అంటూ డిస్కషన్‌ ఓవైపు ఉంటే.. ఏంటీ సామ్‌, చైతు మళ్లీ కలసిపోయారా అంటూ మరోవైపు కామెంట్లు వస్తున్నాయి.

ఇంతకీ ఏమైందంటే… ఇటీవల నాగ చైతన్య (Naga Chaitanya) దగ్గరకు ఓ అభిమాని వచ్చి… తన కొత్త స్పోర్ట్స్ బైక్‌ మీద ఆటోగ్రాఫ్‌ అడిగాడు. దీంతో నాగ చైతన్య ఆ బండి మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫొటోలు కూడా దిగాడు. ఈ టైమ్‌లో హష్ అక్కడకు వచ్చింది. ఆ మొత్తం వీడియోను ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పెట్టారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. అన్నట్లు హుష్‌ అంటే ఎవరో చెప్పలేదు కదా. అది సామ్‌ – చైల పెంపుడు శునకం.

మొన్నీమధ్య కొన్ని ఫొటోల్లో ఈ శునకం సమంత దగ్గర కనిపించింది. ఇప్పుడు అదే శునకం చై దగ్గర ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియో పట్టుకుని సమంత, చై మధ్య ప్యాచప్‌ జరిగిపోయిందా అంటూ డౌట్‌ కూడా రెయిజ్‌ చేస్తున్నారు. మరి దీని మీద క్లారిటీ ఎవరిస్తారో చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus