‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) తో డీసెంట్ సక్సెస్ అందుకున్న తర్వాత అఖిల్ (Akhil Akkineni) ఓ సాలిడ్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. తన అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేలా నెక్స్ట్ సినిమా ఉండాలి అని పరితపించారు. అందులో భాగంగానే సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో ‘ఏజెంట్’ (Agent) అనే భారీ బడ్జెట్ సినిమా చేశాడు. అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మాణంలో దాదాపు రూ.85 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. మలయాళం సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేశారు.
అయితే 2023 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అందువల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడలేకపోయింది. ఆ తర్వాత ఓ డిస్ట్రిబ్యూటర్ కి నిర్మాతకి జరిగిన గొడవల వల్ల.. అతను కోర్టుకెక్కాడు. దీంతో ‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ 2 ఏళ్ళ పాటు నిలిచిపోయింది. మొత్తానికి అన్ని అడ్డంకులను తొలగించుకుని మార్చి 14న ఈ సినిమా ఓటీటీకి వచ్చింది.
సోనీ లివ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడైనా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఏజెంట్ ఫేట్ మారలేదు. సందర్భం లేకుండా ఫైట్ సీక్వెన్స్..లు, యాక్షన్ ఎపిసోడ్స్ రావడం చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోవడం వల్లే ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ ఉన్నాయి అంటూ విమర్శిస్తూనే రివ్యూలు ఇస్తున్నారు.