అజ్ఞాతవాసి విషయంలోనూ అదే రిపీట్

  • December 12, 2017 / 10:43 AM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా జల్సా హిట్ అయితే.. రెండో సినిమా అత్తారింటికి దారేది సూపర్ హిట్ అయింది. ఈ కలయికలో ఇప్పుడు మూడో సినిమా అజ్ఞాతవాసి జనవరి 10 రిలీజ్ కావడానికి ముస్తాబవుతోంది. ఇది పవన్ కి 25 వ చిత్రం. అందుకే మొదటి నుంచి ఈ చిత్రంపై శ్రద్ధ పెట్టారు. సంగీతదర్శకుడు అనిరుధ్ ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అతను స్వరపరిచిన రెండు పాటలు రిలీజ్ అయి యువత హార్ట్ బీట్ అయ్యాయి. అంతేకాదు ఈరోజు పవన్ పై కంపోజ్ చేసిన ప్రత్యేక సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ నెల 16వ తేదీన చిత్ర టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

ఈ న్యూస్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. దీనికంటే సంతోషించదగ్గ న్యూస్ ఒకటి వచ్చింది. డబ్బింగ్, రీరికార్డింగ్ జరుపుకొని డీఐ దశలో ఉన్న ఈ సినిమా ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని, పవన్ అభిమానులను, ప్రేక్షకులను మెప్పించి, తొలిరోజే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంటుందని టాక్. సాధారణంగా పవన్ సినిమా కాస్త బాగుంది అంటే చాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అలాంటిది మొదటిరోజే సూపర్ హిట్ టాక్ వస్తే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అమెరికాలో జనవరి 9 నే ప్రీమియర్ షో ద్వారా హంగామా చేయనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus