నటించే ఆలోచన లేదంటున్న బ్యూటీ!

‘మైనే దిల్‌ తుజ్కో దియా’ అనే హిందీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సమీరా రెడ్డి ఆ తరువాత తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ తో కలిసి ‘అశోక్’, ‘నరసింహుడు’ వంటి చిత్రాల్లో మెరిసిన సమీరా.. చిరుతో కలిసి ‘జై చిరంజీవ’ అనే సినిమాలో నటించారు. కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ బ్యూటీ పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో టచ్ లో ఉంటూ..

తన ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ కోలీవుడ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆర్య, విశాల్ లు ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా ద్వారా సమీరా రీఎంట్రీ ఇవ్వబోతుందని దాదాపు అన్ని వెబ్ సైట్ లలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించింది సమీరా రెడ్డి. ఈ వార్తల్లో నిజం లేదని..

తాను ఏ సినిమాలో నటించడం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని.. సినిమాల్లో నటించడం గురించిన ఆలోచనే లేదని వెల్లడించింది. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. వెండితెరకు దూరమైనా.. అప్పుడప్పుడు తన పిల్లలతో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.a

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus