ఎన్టీఆర్ తో రిలేషన్ గురించి మా ఇంట్లో తెలిసిపోయింది : సమీరా రెడ్డి

సమీరా రెడ్డి పరిచయం అవసరం లేని పేరు. గతంలో ‘నరసింహుడు’ ‘జై చిరంజీవ’ ‘అశోక్’ వంటి చిత్రాలలో నటించింది. ఈమె మంచి డ్యాన్సర్ కూడా. అయితే ‘అశోక్’ తరువాత ఆమె ఒక్క ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రంలో మాత్రమే ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ‘సూర్య సన్ అఫ్ కృష్ణన్’ సినిమాలో కనిపించినప్పటికీ అది తమిళ డబ్బింగ్ చిత్రమే. అయితే ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాపయ్యాయి కాబట్టి ఆమె టాలీవుడ్ లో మళ్ళీ కనిపించలేదు అని అందరూ అనుకున్నారు. కానీ తాను టాలీవుడ్ కు దూరమవ్వడానికి కారణం జూ.ఎన్టీఆర్ వలనే అంటూ తాజాగా కామెంట్స్ చేయడం సంచలనం సృష్టిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. గతంలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసింది. ఈ విషయం పై తాజాగా సమీరా రెడ్డి స్పందించింది. “ఎన్టీఆర్ తో నాకున్న రిలేషన్ ఫ్రెండ్ షిప్ మాత్రమే. ఎన్టీఆర్ స్నేహితుడు కాబట్టే సన్నిహితంగా ఉండేదానిని. అంతకు మించి మా మధ్య ఇంకేమీ లేదు. కానీ అందరూ మా రిలేషన్ షిప్ గురించి బ్యాడ్ గా మాట్లాడుకోవడం, మీడియాలో వార్తలు రావడంతో.. మా ఇంట్లో వాళ్ళకు తెలిసింది. అది రాను రాను పెద్ద సమస్యగా మారుతుండడంతో టాలీవుడ్ సినిమాలకు దూరమయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus