TNR ఫ్యామిలీకి సంపూర్ణేష్ బాబు ఆర్థిక సహాయం

ఒక మనిషిని గొప్పగా డబ్బు సంపాధించకపోయినా కూడా మంచి మనసుతో నలుగురికి సహాయంగా ఉంటే తప్పకుండా మన భవిష్యత్తు తరాలకు ఆ మంచితనం ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని TNR ద్వారా అర్ధమవుతోంది. ఆయన ఆర్థికంగా అనుకున్నంత స్థాయిలో లేకపోయినప్పటికీ కొంతమందికి తనవంతు సహాయం చేశాడు. ఆ మంచి తనం కారణంగా పలువురు TNR కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.

టీఎన్నార్ ఆర్థికంగానే కాకుండా టాలెంట్ ఉన్న వారితో ఇంటర్వ్యూలు చేసి వారి భవిష్యత్తుకు ఎంతగానో హెల్ప్ అయ్యారు. ఇక TNR ద్వారా లాభపడ్డ వారిలో సంపూర్ణేష్ బాబు కూడా ఉన్నారు. ఫ్రాంక్లీ విత్ TNR ఇంటర్వ్యూ ద్వారా సంపూర్ణేష్ బాబు అసలు లైఫ్ ఏమిటో జనాలకు అర్థమయ్యింది. ఆ కృతజ్ఞతను ఎప్పటికి మర్చిపోని సంపూర్ణేష్ బాబు తనవంతు సహాయంగా TNR ఫ్యామిలీకి ఆర్థిక సహాయం అందించారు.

‘తెలుగు సినిమా జర్నలిస్టు TNR గారి కుటుంబానికి నా వంతుగా రూ.50,000 వారి భార్య అకౌంట్ లో డిపాసిట్ చెయ్యటం జరిగింది. వారి ఇంటర్వ్యూ ద్వారా నేను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒక మెట్టు ఎదిగాను. వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్న, నా వంతు సాయం తప్పక చేయగలను. మీరు సపోర్ట్ చెయ్యండి’ అంటూ సోషల్ మీడియా ద్వారా సంపూర్ణేష్ బాబు తెలియజేశారు. ఇక TNR అభిమానులు కూడా వారికి తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు.

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus