Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 6, 2026 / 01:00 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శివాజీ (Hero)
  • లయ (Heroine)
  • రోహన్, ప్రిన్స్, అలీ, ధన్ రాజ్, శరత్ లోహితస్వ తదితరులు (Cast)
  • సుధీర్ శ్రీరామ్ (Director)
  • శివాజీ (Producer)
  • రంజిన్ రాజ్ (Music)
  • రిత్విక్ రెడ్డి (Cinematography)
  • బాలు మనోజ్ (Editor)
  • Release Date : మార్చి 06, 2026
  • శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ (Banner)

“కోర్ట్” సినిమాతో నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శివాజీ (Sivaji), “సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని”తో (Sampradayini Suppini Suddapoosani) నిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు. మొదట ఈటీవీ విన్ యాప్ లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనుకున్న ఈ సినిమాని ఫ్యామిలీ ప్యాక్ ఆఫర్లతో థియేటర్లకి తీసుకొచ్చారు. మరి ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!!

Sampradayini Suppini Suddapoosani Movie Review

Sampradayini Suppini Suddapoosani Movie Review and Rating

కథ: శ్రీరామ్ (శివాజీ) ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్. పైసా లంచం తీసుకోకుండా తన విధులు నిర్వర్తిస్తుంటాడు. ఆ క్రమంలో లోకల్ ఎమ్మెలే మరియు ఎస్సై విక్రమ్ (ప్రిన్స్)తో తలపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఆ క్రమంలో అనుకోని విధంగా విక్రమ్ వెతుక్కుంటూ శ్రీరామ్ ఇంటికి రావడం, అక్కడ అనుకోని సంఘటన చోటు చేసుకోవడం, దాంతో శ్రీరామ్ & ఫ్యామిలీ చిక్కుల్లో పడతారు.

అసలు శ్రీరామ్ ఇంట్లో ఏం జరిగింది? ఎందుకని శ్రీరామ్ & ఫ్యామిలీ ఉన్నపళంగా రోడ్డు ప్రయాణం చేయాల్సి వస్తుంది? ఈ క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? వాటి నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు? వంటి ప్రశ్నలకి సమాధానమే “సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని” చిత్రం.

Sampradayini Suppini Suddapoosani Movie Review and Rating

నటీనటుల పనితీరు: సినిమాలో కనిపించే నటీనటులందరూ దాదాపుగా సీనియర్లే. నటన పరంగా ఎవ్వరూ తగ్గలేదు. ఎవరి పాత్రకి తగ్గట్లు వారు ఒదిగిపోయారు. శివాజీ-లయ కాంబినేషన్ చాన్నాళ్ల తర్వాత రిపీట్ అవ్వడం చూడబుద్ధిగా ఉంది. వాళ్ల కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది.

రోహన్ కామెడీ టైమింగ్ కాస్త ఓవర్ డోస్ అయినా.. అక్కడక్కడా నవ్వించగలిగాడు. కొన్ని సన్నివేశాల్లో మాత్రం మరీ ఇంత చిత్రమైన బిహేవియర్ ఎందుకు అనే అనుమానం కలగకమానదు.

ప్రిన్స్ పాత్ర చిన్నదే అయినా.. కావాల్సిన ఇంపాక్ట్ ఇచ్చింది. ధన్ రాజ్ పాత్ర కూడా డీసెంట్ గా ఉంది. అలీ, ఇమ్మాన్యూల్ కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయ్యింది.

Sampradayini Suppini Suddapoosani Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్, ఎడిటింగ్ వంటి డిపార్ట్మెంట్స్ మిడ్ రేంజ్ వర్క్ తో సరిపెట్టుకున్నారు. నిజానికి ఈ తరహా సినిమా కథ కంటే, టెక్నికల్ బ్రిలియన్స్ తో అలరించేందుకు స్కోప్ ఉంటుంది. కానీ.. నిర్మాత శివాజీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

దర్శకుడు సుధీర్ శ్రీరామ్ రాసుకున్న కథలో మేటర్ ఉంది. దాన్ని ఇంకాస్త బెటర్ స్క్రీన్ ప్లేతో నడిపించి ఉంటే బాగుండేది అనిపించింది. ముఖ్యంగా లయ ప్రెగ్నెంట్ అయ్యానని హడావుడి చేసే సన్నివేశం, చెక్ పోస్ట్ దగ్గర రోహన్ తింగరోడిలా వ్యవహరించే సీన్, ట్విస్ట్ రివీల్ అయ్యే సందర్భం వంటివి వాటికి ఇంకాస్త బెటర్ ట్రీట్మెంట్ అవసరం. సింగిల్ లైన్ స్టోరీగా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. సినిమాగా “సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని” పూర్తిస్థాయిలో అలరించలేకపోయిందనే చెప్పాలి.

Sampradayini Suppini Suddapoosani Movie Review and Rating

విశ్లేషణ: ఈ సినిమాకి సగం మైనస్ టైటిల్. కథకి ఏమాత్రం సంబంధం లేని టైటిల్. ఏదో ట్రెండ్ అయ్యింది కదా అని “సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని” అనే టైటిల్ పెట్టేశారు కానీ.. కథని కానీ థీమ్ ని కానీ ఏమాత్రం ఎలివేట్ చేయలేకపోయింది. అలాగే.. టెక్నికాలిటీస్ చాలా వీక్ ఉన్నాయి. 2026లో ప్రేక్షకులు కేవలం కాంబినేషన్ల కోసం, ఓ నాలుగైదు కామెడీ సీన్ల కోసం థియేటర్లకి రావడం లేదు.

ఈ విషయం ప్రతివారం ఏదో ఒక సినిమాతో ప్రూవ్ అవుతూనే ఉంది. అయినా.. మేకర్స్ ఇంకా మిడ్ రేంజ్ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. “సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని” కూడా ఆ కేటగిరీలోకే వస్తుంది. శివాజీ నిర్మాతగా, హీరోగా తనకి దొరికిన గోల్డెన్ ఛాన్స్ ని సరిగా వినియోగించుకోలేకపోయాడని చెప్పాలి.

Sampradayini Suppini Suddapoosani Movie Review and Rating

ఫోకస్ పాయింట్: వర్కవుట్ అవ్వని క్రైమ్ కామెడీ!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laya
  • #Sampradayini Suppini Suddapoosani Movie
  • #Sivaji

Reviews

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

15 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

16 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version