ప్రతి సినిమా నటుడి ఎంట్రీ సవ్యంగా సాగదు. అవకాశాల కోసం తిరిగేటప్పుడు ఎదుర్కోని చీత్కారాలు ఉండవు, ఈసడింపులు ఉండవు. ముఖం మీద తలుపు ఎన్ని తలుపులు పడుంటాయో. ఆకలి కడుపులు, అరిగిన చెప్పులు, చినిగిన చొక్కాలు వీటి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సముద్రఖని విషయంలోనూ ఇలాంటివే జరిగాయి. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఇటీవల ఆయన చెప్పుకొచ్చారు. ఓ దర్శకుడి ఆఫీసుకెళితే ‘తుమ్మ మొద్దులా ఉన్నావ్! అసలు నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా’ అన్నారట.
డిగ్రీ పూర్తయ్యాక అమ్మ ఇచ్చిన రెండువేల రూపాయలతో సినిమా కలలతో చెన్నై వచ్చారాయన. నటుడు కావాలని కొన్ని ఫొటోలు పట్టుకుని ఆఫీసులకు తిరిగారట ఆయన. ఒకానొక సందర్భంలో ఓ సహాయ దర్శకుడు ‘బుద్ధుందా! ఈ మొహానికెందుకు ఆడిషన్, టైం వేస్ట్ కాకపోతే!’ అని మెడపట్టి గెంటేశాడట. పరిస్థితి దారుణంగా మారిందట.. ఓ సమయంలో చెప్పులు తెగిపోయి కొత్తవి కొనుక్కోవడానికీ డబ్బుల్లేని పరిస్థితి వచ్చింది. ఒట్టి కాళ్లతో నడిచి అరికాళ్లూ పుళ్లయ్యాట. ఆ సమయంలో పాతబట్టలు చించి కాళ్లకి చుట్టుకుని నడిచేవారట. ఓ రోజు ఆయన పక్క రూమతను బాత్రూమ్‌కి వెళ్లడానికి వాడే స్లిప్పర్స్ వేసుకుని బయటకు వచ్చారట సముద్రఖని. ఈలోగా అతను పరుగెత్తుకుంటూ నా వెనకే వచ్చి ‘చెప్పులిస్తావా… ఇవ్వవా!’ అని గొడవపడ్డాడడట.
అందరికీ అన్నం పెట్టే రైతు కుటుంబంలో పుట్టినవాణ్ని, డిగ్రీ ఫస్ట్‌క్లాసులో పాసైనవాణ్ని నన్ను… ఇలా తిట్టడమా అనుకుంటూ ఆత్మహత్య చేసుకుందామని రైల్వే పట్టాల వైపు వెళ్లారట సముద్రఖని. కానీ ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి తన దృష్టి మరల్చాడట. ఆ తర్వాత తన కోసం కొన్ని సీన్లు రాసుకున్నారట సముద్రఖని. అలా సిద్ధం చేసుకున్న సీన్‌లు సుందర్ కె.విజయన్ అనే టీవీ సీరియళ్ల డైరెక్టర్ దగ్గరకు వెళ్లారట. ఆయన స్క్రిప్టు చూసి… ‘నీ రాత బాగుంది. నటుడిగా కన్నా, రచయితగా నువ్వు ఆకట్టుకుంటావ్, కష్టపడితే దర్శకుడు అవుతావు, నా అసిస్టెంట్‌గా చేరొచ్చు కదా’’ అని అడిగారట. అలా దర్శకత్వ విభాగంలోకి, సినిమాల్లోకి వచ్చారట సముద్రఖని.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?