Samuthirakani: వైరల్ అవుతున్న సముద్రఖని ఆసక్తికర వ్యాఖ్యలు!

  • July 25, 2023 / 09:34 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ సాయితేజ్ తో కలిసి నటించిన బ్రో సినిమా రిలీజ్ కు మరో 48 గంటల సమయం ఉంది. ఈ సినిమాకు సంబంధించి బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా బుకింగ్స్ మొదలైన చోట మాత్రం బ్రో సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ సినిమాపై అంచనాలను పెంచుతుండగా సముద్రఖని బ్రో సినిమా గురించి పవన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

పాలిటిక్స్ లో పవన్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉందని పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్, నేషనల్ లీడర్ కంటే ఎక్కువ అని సముద్రఖని పేర్కొన్నారు. మన దేశాన్ని అభివృద్ధి చేసి ప్రణాళికలు పవన్ దగ్గర చాలా ఉన్నాయని సముద్రఖని వెల్లడించారు. భవిష్యత్తు తరానికి బంగారు బాట వేసే 25 సంవత్సరాల ప్లాన్ పవన్ దగ్గర ఉందని సముద్రఖని కామెంట్లు చేశారు. ప్రపంచానికి దిశా నిర్దేశం చేసే స్థాయి పవన్ కు ఉందని సముద్రఖని (Samuthirakani) వెల్లడించారు.

థమన్ మ్యూజిక్ బ్రో సినిమాకు ప్రాణం పోస్తుందని ఈ సినిమాలోని సీన్లను చూసి థమన్ ఎమోషనల్ అయ్యారని సముద్రఖని వెల్లడించారు. ఈ సినిమా చూసి థమన్ తన చనిపోయిన తండ్రిని గుర్తు చేసుకున్నారని సముద్రఖని అన్నారు. థమన్ మ్యూజిక్ గొప్పగా ఉందని ఆయన కామెంట్లు చేశారు. సముద్రఖని తన సినీ కెరీర్ లో బెస్ట్ మూవీ బ్రో అని చెబుతుండటం గమనార్హం.

బ్రో సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు 30 నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలను అందించిందని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ త్వరలో ఇతర క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి. పవన్ బ్రో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus