Samyuktha Menon: భీమ్లా నాయక్ బ్యూటీపై అలాంటి కామెంట్లు చేశారా?

తక్కువ సినిమాలే చేసినా యూత్ లో, సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో సంయుక్త మీనన్ ఒకరని చెప్పవచ్చు. బింబిసార సినిమాలో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటించగా వచ్చే నెల మొదటివారంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. పాప్ కార్న్ అనే సినిమాతో సంయుక్త మీనన్ కెరీర్ మొదలు కాగా మలయాళంలో వరుసగా సినిమాలు చేయడం ద్వారా ఈ హీరోయిన్ పాపులారిటీని పెంచుకున్నారు. బింబిసార సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని ఈ బ్యూటీ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

మలయాళంలో చేసిన సినిమాల ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని నటిని అవుతానని నేను అస్సలు అనుకోలేదని సంయుక్త మీనన్ చెప్పుకొచ్చారు. తెలుగులో నాకు ఛాన్స్ వచ్చిన తొలి మూవీ బింబిసార అని అయితే ఈ సినిమాకు ముందే భీమ్లా నాయక్ మూవీ థియేటర్లలో విడుదలైందని సంయుక్త మీనన్ తెలిపారు. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో సాయితేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నానని సంయుక్త మీనన్ వెల్లడించారు.

ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలని నాకు ఉందని గ్లామర్ ను డ్రెస్ తో కనెక్ట్ చేసి చూడటం తప్పని సంయుక్త మీనన్ తెలిపారు. తొలి మలయాళ మూవీ పాప్ కార్న్ ను చూసి నాకు నటించడం రాదని అన్నారని సంయుక్త మీనన్ తెలిపారు. పాప్ కార్న్ మూవీలో ఛాన్స్ వచ్చింది కదా అని క్యాజువల్ గా నటించానని ఆ సమయంలో నాకు సినిమాల గురించి పెద్దగా తెలియదని

కథ స్క్రిప్ట్ పై కూడా నాకు అవగాహన లేదని సంయుక్త మీనన్ చెప్పుకొచ్చారు. ఆ సినిమా తర్వాతే సినిమా రంగం గురించి పూర్తి అవగాహన వచ్చిందని సంయుక్త మీనన్ కామెంట్లు చేశారు. సంయుక్త మీనన్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus