Samyuktha Menon: ఆ విషయంలో నేను స్వార్థపరురాలిని: సంయుక్త మీనన్

పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. ఈ సినిమాలో రానా భార్యగా నటించిన సంయుక్త ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబి సారా అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి సంయుక్త మీనన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను నటించిన పాత్రలో మరొకరు తనకు డబ్బింగ్ చెప్పడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. నేను నటించిన సినిమాని స్క్రీన్ పై చూసినప్పుడు నా పాత్రను నేను ఓన్ చేసుకోగలగాలి. మనకు భాష తెలియకుండా నటిస్తే ఆ పాత్రతో మనకున్న అనుబంధాన్ని కోల్పోతామని, నా క్యారెక్టర్ విషయంలో నేను కాస్త స్వార్థపరురాలిగానే ఆలోచిస్తానని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు.

అందుకే తాను తెలుగు నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక ట్యూటర్ నీ పెట్టుకొని మరి తెలుగు నేర్చుకున్నానని తెలిపారు. సినిమా గురించి మాట్లాడుతూ హీరో కళ్యాణ్ రామ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.కళ్యాణ్ రామ్ మాటల కన్నా ముందు కళ్ళు మాట్లాడతాయని ఆయన కళ్ళల్లో పవర్ ఉందంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. తనని ఒక్కసారిగా బింబిసార పాత్రల్లో చూడగానే ఎంతో గంభీరంగా కనిపించారు.

కళ్యాణ్ రామ్ చాలా మంచి వ్యక్తి షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఆయన తన వద్దకు వచ్చి ఈ సినిమాలో భాగమైనందుకు ధన్యవాదాలు అంటూ తనకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారని ఇప్పటివరకు తనకు అలా థాంక్స్ చెప్పిన వారెవరు లేరు అంటూ ఈ సందర్భంగా సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus