Samyuktha Menon: వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ సంయుక్త మీనన్!

సంయుక్త మీనన్ అందరికీ సుపరిచితమే. మలయాళం బ్యూటీ అయినప్పటికీ తెలుగులో తొందరగానే ఫేమస్ అయిపోయింది. ‘భీమ్లా నాయక్’ లో రానా భార్యగా.. పవన్ కళ్యాణ్ కు చెల్లెలి వంటి పాత్రలో నటించి మెప్పించింది. అటు తర్వాత ‘బింబిసార’ సినిమాలో కూడా నటించి మెప్పించింది.ఆ సినిమా కూడా సూపర్ హిట్టే..! ఇక ఇటీవల వచ్చిన ‘సార్’ సినిమాలో కూడా చాలా బాగా నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో సంయుక్త మీనన్ రేంజ్ పెరిగింది.

‘సార్’ సినిమా రిలీజ్ అయ్యి 11 రోజులు కావస్తున్నా.. ఈమె గురించి డిస్కషన్లు మాత్రం తగ్గలేదు.ఈమె పారితోషికం కూడా పెంచేసింది అంటున్నారు. ప్రస్తుతం ఈమె ‘విరూపాక్ష’ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా నటిస్తోంది. అటు తర్వాత ‘బింబిసార 2’ లో కూడా నటిస్తున్నట్టు వినికిడి. ఇదిలా ఉండగా.. సంయుక్త తెలుగు కంటే ముందు మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. మొదట్లో ఈమె కాస్త బొద్దుగా కూడా ఉండేది.

అయితే ఎప్పుడైతే టాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయో అప్పుడు ఫిట్ గా మారినట్టు తెలుస్తోంది. ఈమెకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోల్లో ఈమె మేడం లుక్ లోనే కనిపిస్తుండగా.. ఒకప్పటి మేడమ్ లుక్ లో ఈమె కొంచెం బొద్దుగా కనిపిస్తుంటే.. ‘సార్’ లోని మేడమ్ లుక్ లో ఫిట్ గా కనిపిస్తుంది. అందుకే నెటిజన్లు.. ‘అప్పుడు ఘాటు.. ఇప్పుడు ఫిట్’ ‘వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus