సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకి పెద్దపీట వేస్తుంటారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా హిట్టు సెంటిమెంట్ల కోసం వాళ్ళు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. కొబ్బరి కాయ కొట్టే ముహూర్తం నుండి గుమ్మడికాయ కొట్టే వరకు వాళ్ళు ఎన్నో సెంటిమెంట్లు ఫాలో అవుతారు.ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. టాలీవుడ్లో ఇప్పుడు మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ గా సంయుక్త మీనన్(Samyuktha Menon) పేరు ఎక్కువగా చెప్పుకుంటున్నారు.ఈ అమ్మడు నటించిన ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకుంటాయి.
‘భీమ్లా నాయక్’ ‘సార్’ ‘విరూపాక్ష’ ‘బింబిసార’ ‘అఖండ 2’ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి సినిమాలు అన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. తెలుగులోనే కాకుండా మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. దీంతో ఈ లక్కీ ఛార్మ్ పై ఓ స్టార్ దర్శకుడి ఫ్యూచర్ ఆధారపడి ఉంది అంటున్నారు కొందరు నెటిజెన్లు.ఆ స్టార్ దర్శకుడు మరెవరో కాదు పూరీ జగన్నాథ్.
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూరీ చేసిన ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా మిగిలాయి.’ఇస్మార్ట్ శంకర్’ కి ముందు పూరీ చేసిన సినిమాలు చాలా వరకు ప్లాపులు అయ్యాయి. అందుకే పూరీతో సినిమాలు చేయడానికి నిర్మాతలు, టాలీవుడ్ హీరోలు భయపడే పరిస్థితి ఏర్పడింది. గోపీచంద్ వంటి హీరో కూడా పూరీతో సినిమా అంటే వెనకడుగు వేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి పిలిచి మరీ పూరికి ఛాన్స్ ఇచ్చాడు.
వీరి కాంబినేషన్లో ‘స్లమ్ డాగ్’ అనే సినిమా రూపొందుతుంది. ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుంది. ఆమె గోల్డెన్ లెగ్ కాబట్టి..ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అని పూరీ అభిమానులు భావిస్తున్నారు. చూడాలి వారి నమ్మకం ఎంత బలమైనదో.