Bigg Boss 7 Telugu: నాగ్ అడిగిన ప్రశ్నకి తడబడిన సందీప్..! రీజన్ ఏం చెప్పాడంటే.?

బిగ్ బాస్ హౌస్ లో సండే ఎపిసోడ్ లో కూడా నాగార్జున హౌస్ మేట్స్ పై పంచ్ లు వేస్తూ రెచ్చిపోయారు. వాళ్ల ఆటతీరుని బట్టీ సెటైర్స్ వేస్తూ ఒక్కొక్కరితో ఆడుకున్నాడు కింగ్ నాగార్జున. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే శివాజీ అస్త్రాన్ని కొట్టేసిన థామినికి క్లాస్ పీకారు. సెకండ్ టైమ్ వచ్చిన పవర్ అస్త్రాన్ని దొబ్బేయద్దని చెప్పాను కదా అంటూ మాట్లాడారు. అంతేకాదు, థామిని ఆ అస్త్రాన్ని తిరిగి శివాజీకి ఇచ్చేయమని చెప్పాడు కింగ్. దీంతోనే ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో కట్టప్పు – భళ్లాలదేవ గేమ్ ని ఆడించాడు కింగ్ నాగ్. హౌస్ లో వెన్నుపోటు పొడిచే కట్టప్ప ఎవరు ? అలాగే, పోటీ ఇచ్చే భళ్లాలదేవుడు ఎవరు అనేది బాహుబలి గెటప్ వేసుకుని హౌస్ మేట్స్ రీజన్స్ తో సహా చెప్పాలి. ఇక్కడే సందీప్ ని భళ్లాదేవుడు అని థామిని చెప్పింది. తనకి పోటీ అతనే అని క్లియర్ గా మాట్లాడింది.

ఆ తర్వాత సందీప్ బాహుబలి గెటప్ వేసుకుని తనకి పోటీ భళ్లాల దేవుడిగా శుభశ్రీ ని పెట్టాడు. అలాగే, కట్టప్ప శివాజీ అని చెప్పాడు. గ్రూప్ గా ఫామ్ అయి నేను అమర్ కి ఇన్యూనిటీ ఇవ్వడాన్ని తప్పుబడ్డాడు. కానీ నాకు జెన్యూన్ అనిపించింది సార్ అది చెప్పాడు. ఇక్కడే నాగార్జున నేను కుడా జెన్యూన్ గా అడుగుతున్నాను.. అసలు ప్రిన్స్ ని కాదని అమర్ ని నువ్వు ఎందుకు సెలక్ట్ చేస్కున్నావో చెప్పు అన్నాడు. దీంతో సందీప్ సూప్ లో పడ్డాడు. ఈ మాట నాగార్జున అడగగానే ప్రిన్స్ వెనకనుంచీ క్లాప్స్ కొట్టాడు. ఇక్కడే సందీప్ యావార్ టీమ్ లో తనొక్కడే ఆడాడు అని ఇంకెవరు ఆడలేదని ఈవినింగ్ గార్డెన్ లో చేసిన దానికి అది నచ్చలేదని అది పైయిన్ ఫుల్ అని నాకు తెలుసు అని చెప్తుంటే నాగార్జున మంచి కౌంటర్ వేశాడు.

అమర్ కూడా మరి అలాగే చేశాడు కదా అని గుర్తు చేశాడు. అంతేకాదు, సందీప్ ని స్ట్రయిట్ గా బిగ్ బాస్ ఇవన్నీ కాల్యుక్ లేట్ చేయమని నీకు చెప్పాడా అని నిలదీశాడు. దీంతో సందీప్ తడబడ్డాడు. ఆట ప్రకారం చేశావా, ఆలోచన ప్రకారం చేశావా అని సూటి ప్రశ్న వేశారు. దీంతో ఆలోచన ప్రకారమే చేశా అన్నాడు. మరి అది నీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినపుడు శివాజీ అన్నదాంట్లో తప్పేంటి అని లాక్ చేశారు. ఇక్కడే శివాజీ కలగజేసుకుని నేను ఒక విషయం చెప్తా అన్నాడు.

మీ దగ్గర ఉన్న బెస్ట్ బయటకి రావట్లేదు అని చిన్న కో ఆపరేషన్ వల్లే గేమ్ లో మజా పోతోందని, నాకు సెల్ఫిష్ నెస్ లేదని టెన్షన్ పడుతున్నారని క్లియర్ గా చెప్పాడు. అలాగే, నా ప్రెండ్స్ ఉన్నా కూడా నేను అలాగే ఆడేవాడ్నేమో అని చెప్పాడు. అది కట్ చేస్తే పెద్ద గేమ్ వస్తుందని శివాజీ అన్నాడు. దీంతో సందీప్ ఎక్స్ ప్లనేషన్ ఇవ్వకుండానే సంభాషణ ముగిసిపోయింది.

ఆ తర్వాత సందీప్ కి చాలామంది హౌస్ లో భళ్లాల దేవ క్యారెక్టర్ ఇస్తూ మంచి కాంపిటీటర్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈసారి నామినేషన్స్ లో ఈ గేమ్ కీలకంగా మారబోతున్నట్లుగా అనిపిస్తోంది. మరి నామినేషన్స్ హీట్ ఈవారం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరం.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus