Sandeep: 8 వారాలకు భారీగా సంపాదించిన సందీప్ మాస్టర్?

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రస్తుతం 8 వారాలను పూర్తిచేసుకుని తొమ్మిదవ వారంలోకి అడుగు పెట్టింది. ఇలా మొదటి ఏడు వారాలు లేడీ కంటెస్టెంట్లు హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా ఎనిమిదవ వారంలో మాత్రం ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి ఆట సందీప్ మాస్టర్ బయటకు వచ్చారు. అయితే ఈయన ఎలిమినేట్ కావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
సందీప్ మాస్టర్ ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చారు.

అయితే ఇలా ఇప్పటివరకు ఈయన నామినేషన్స్ లో లేకపోవడం ఆయన ఎలిమినేషన్ కి కారణమైందని చెప్పాలి. ఒక వారం కూడా సందీప్ మాస్టర్ నామినేషన్స్ లో లేకపోవడంతో ఈయనకు ఓటు బ్యాంక్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇలా టాప్ ఫైవ్ లో ఉంటారు అనుకున్నటువంటి సందీప్ మాస్టర్ ఎనిమిదవ వారం ఎలిమినేట్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక సందీప్ మాస్టర్ సైతం నామినేషన్ లో ఉన్నటువంటి మొదటి వారమే ఎలిమినేట్ అవుతారని అసలు ఊహించలేదు.

ఇక తను ఎలిమినేట్ అయ్యారనే విషయాన్ని నాగార్జున ప్రకటించడంతో కాస్త ఎమోషనల్ అయ్యారు. సందీప్ మాస్టర్ 8 వారాలపాటు హౌస్ లో కొనసాగిన భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ అందుకున్నారు అంటూ తాజాగా ఈయన రెమ్యూనరేషన్ కి సంబంధించినటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. సందీప్ మాస్టర్ హౌస్ లోకి వెళ్లేముందు వారానికి 2.75 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చేలాగా అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తుంది.

ఇలా వారానికి ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి ఈయన 8 వారాలకు గాను దాదాపు 22 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 8 వారాలకు 22 లక్షల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఏది ఏమైనా బిగ్ బాస్ కార్యక్రమంలో 8 వారాలు ఉన్న (Sandeep) సందీప్ మాస్టర్ భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నారని చెప్పాలి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus