Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతున్నాడు. 2021 లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఇప్పటికీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది లేదు. దానికి ప్రధాన కారణం ప్రభాస్.. వరుస సినిమాలతో బిజీగా ఉండటం ఒకటైతే.. మరొక కారణం.. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ తో కొన్నాళ్ళు బిజీగా గడపడం అనే చెప్పాలి.

Chiranjeevi

అలాగే సందీప్ కి ప్రభాస్ బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు వేరే సినిమా చేయకూడదు అని సందీప్.. ప్రభాస్ కి బలంగా చెప్పడం కూడా జరిగిందని ఇండస్ట్రీ టాక్. మరోపక్క ఈ సినిమాలో చిరంజీవి కూడా నటిస్తున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.సందీప్ కి చిరంజీవి అంటే చాలా ఇష్టం. ‘మాస్టర్’ సినిమాలో చిరంజీవి పెర్ఫార్మన్స్ ను అతను బాగా ఎంజాయ్ చేస్తానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

చిరు కూడా పంధా మార్చి మల్టీస్టారర్లు చేయడానికి రెడీగానే ఉన్నారు. కాబట్టి.. ‘స్పిరిట్’ లో చిరు ఎంపిక దాదాపు ఖరారైందని అంతా భావించారు. సోషల్ మీడియాలో.. ఇండస్ట్రీ వర్గాల్లో దీని గురించి ఎక్కువగానే చర్చ జరిగింది. కానీ సందీప్ వెంటనే ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చింది లేదు. అందువల్ల అది నిజమని ఇంకా ఎక్కువ మంది నమ్మరు.

కానీ తాజాగా ఓ సందర్భంలో సందీప్ ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చేశాడు. ఇంకో రకంగా గాలి తీసేశాడు అనే చెప్పాలి. సందీప్ మాట్లాడుతూ.. ‘ ‘స్పిరిట్’ లో చిరంజీవి గారు నటిస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. అది ఒక రూమర్ మాత్రమే’ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus