‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ కొత్త సినిమా అప్డేట్?

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సందీప్ రెడ్డి వంగా. టాలీవుడ్ లో ‘గేమ్ చేంజెర్’ మూవీగా వచ్చిన ఈ చిత్రం ఘాన విజయాన్ని నమోదుచేసింది. సందీప్ వంగా డైరెక్షన్ కు స్టార్ హీరోలు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నాడు. ఇక సందీప్ కూడా మహేష్ ను కలిసి ఓ లైన్ వినిపించాడు. లైన్ నచ్చింది ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని మహేష్ చెప్పి పంపించాడు. దీంతో గట్టిగా కసరత్తు చేసి స్క్రిప్ట్ ను మహేష్ వద్దకు తీసుకెళ్ళాడు. కానీ అది మహేష్ నచ్చలేదు. మార్చి తీసుకురమ్మని చెప్పాడు. ఏ గ్యాప్ లో మహేష్ తన కమిట్ అయిన డైరెక్టర్లతో సినిమాలు చేస్తానని చెప్పాడట.

ఈ గ్యాప్ లో సందీప్ రెడ్డి హిందీలో షాహిద్ కపూర్ తో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈరోజు ప్రేక్షకుల విడుదల కాబోతుంది ఈ చిత్రం. అయితే మహేష్ ను అన్ని సార్లు కలిసిన సందీప్.. కథతో ఆయన్ని మెప్పించలేకపోయాడట. ఇదిలా ఉండగా ఇప్పుడు సందీప్ ‘క్రైమ్ నేపథ్యంలో సాగే ఓ కథని సిద్ధం చేస్తుకున్నాడట. ఈ కథకు సెట్టయ్యే హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టాడట. దీంతో మహేష్ తో సందీప్ సినిమా లేదని స్పష్టమవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus