Sandeep Reddy Vanga: త్వరలో మరో అర్జున్ రెడ్డి గా ఆ మెగా హీరో మారునున్నాడా..!

సందీప్ రెడ్డి వంగ‌.. ఇప్పుడు ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్న ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టిదాకా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన అత‌డి సినిమాల సంఖ్య రెండే. అది కూడా ఒక క‌థ‌నే రెండు భాష‌ల్లో తీశాడు. కానీ అత‌ను యూత్‌లో తెచ్చుకున్న క్రేజ్ మాత్రం అలాంటిలాంటిది కాదు. తెలుగులో అర్జున్ రెడ్డితో సెన్సేష‌న్ క్రియేట్ చేసి.. హిందీలో అదే క‌థ‌తో తీసిన క‌బీర్‌సింగ్‌తో అక్క‌డా సంచ‌ల‌నం రేపాడు.. ఇంత త‌క్కువ వ్య‌వ‌ధిలో ఇంత హైప్ తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ఇంకెవ‌రూ లేరంటే అతిశ‌యోక్తి కాదేమో.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఓ సినిమా చేసే అవకాశం ఆయనకు వచ్చిందని టాలీవుడ్ ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి. అయితే..‌. ఆ సినిమా ఇప్పటికీ పట్టాలు ఎక్కలేదు. మహేష్ బాబుతో సినిమా ఎందుకు మిస్ అయ్యిందో లేదో చెప్పారు సందీప్ రెడ్డి వంగా.

ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన సినిమా ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మికా మందన్న జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ ఒకటిన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి దర్శకుడు మాట్లాడారు.

”మహేష్ బాబు గారికి నేను ఒక కథ చెప్పాను. అది ఆయనకు నచ్చింది. అయితే వేరే కమిట్మెంట్స్ ఉండడం వలన ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. మహేష్ బాబు గారితో మాత్రమే కాదు రామ్ చరణ్ గారితోనూ, మిగతా హీరోలతోనూ నాకు సినిమాలు చేయాలని ఉంది” అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus