Sandy: శాండీ మాస్టర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నోరెళ్లబెడుతారు!

  • October 23, 2023 / 05:25 PM IST

మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో చాక్లెట్ కాఫీ అనే ఐటెం ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో’ చిత్రం లో అదరగొట్టిన యాక్షన్ ఎపిసోడ్ ఇది. సినిమా ప్రారంభం నుండి సీరియల్ కిల్లర్స్ మర్డర్స్ చేస్తూ, ఒకరోజు రాత్రి విజయ్ నడుపుతున్న కాఫీ షాప్ లోకి వస్తారు. రాత్రి అయ్యింది షాప్ మూసేసారు అని చెప్పినా వినకుండా ‘చాక్లెట్ కాఫీ’ అని పదే పదే హీరో ని అడుగుతాడు.

ఈ ఎపిసోడ్ లో వచ్చే ఫైట్ సీన్ సినిమాకి పెద్ద హైలైట్. అయితే ఇందులో సీరియల్ కిల్లర్ గా నటించిన ఆ వ్యక్తి ఎవరు..?, చూస్తుంటే అచ్చం అర్జున్ దాస్ లాగా అనిపిస్తున్నాడు కానీ, అతను కాదు. నెటిజెన్స్ గూగుల్ లో విపరీతంగా గత రెండు రోజుల నుండి వెతకడం మొదలు పెట్టారు. అలా నెటిజెన్స్ వెతికిన సమాచారం ప్రకారం ఆ సీరియల్ కిల్లర్ పాత్ర పోషించిన వ్యక్తి పేరు శాండీ. అందరూ ఇతనిని శాండీ మాస్టర్ అని పిలుస్తూ ఉంటారు.

ఇతను (Sandy) ఒక్క పెద్ద డ్యాన్స్ మాస్టర్. కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోని చార్ట్ బస్టర్ సాంగ్స్ కి కోరియోగ్రఫీ చేసాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన విజయ్ ‘వారిసు’ చిత్రం లో కూడా కొన్ని సాంగ్స్ కి ఇతను కొరియోగ్రఫీ చేసాడు. అలా కొరియోగ్రాఫేర్ గా కొనసాగుతూనే మద్యమద్యలో ఏదైనా ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఇస్తే వదులుకోకుండా చేస్తూ వచ్చాడు,

కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ‘లియో’ చిత్రం విడుదలైన తర్వాత ఇతను సౌత్ ఇండియా మొత్తం సెన్సేషనల్ టాపిక్ అయిపోయాడు. నటుడిగా రాబొయ్యే రోజుల్లో ఇతను చాలా పీక్ రేంజ్ ని చూస్తాడని ‘లియో’ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచి ఎత్తారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus