Sangeeth Sobhan: ప్రభాస్ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్ శోభన్ కొత్త సినిమా
- June 25, 2026 / 12:57 PM ISTByFilmy Focus Desk
చేసిన ఐదుకి ఐదు సినిమాల్లో తన కంటూ ప్రత్యేకమై గుర్తింపు సంపాదించుకున్నాడు ఆ హీరో. ఓటీటీలో కూడా తనంటే ఏంటో ఓ నాలుగు ప్రాజెక్ట్‌లతో చూపించాడు. యువ హీరోల్లో పెక్యూలియర్ టైమింగ్, డైలాగ్ డెలివరీ, ప్రమోషనల్ స్ట్రాటజీలు ఆ కుర్ర హీరో సొంతం. రీసెంట్‌గా ‘రాకాసా’ సినిమాతో మంచి విజయం అందుకున్న సంగీత్ శోభన్ గురించే ఇదంతా. ఇప్పుడు ఆయన మరో సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.
Sangeeth Sobhan
ఈ కొత్త సినిమాకు సంగీత్‌ను అభిమానించే స్టార్ హీరో ప్రభాస్‌కు ఓ లింక్ ఉండటం గమనార్హం. ప్రభాస్ స్టైలిష్ హిట్ ‘సాహో’ సినిమాకు డైరక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన ప్రణవ్ రావు ఈ సినిమాకు దర్శకుడు. సంగీత్ శోభన్‌కి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ‘మ్యాడ్’ సినిమాకు కూడా ఈ దర్శకుడితో లింక్ ఉంది. అలా తనకు బాగా దగ్గరైన ప్రభాస్, నిర్మాత నాగవంశీ కనెక్టివిటీతో ఈ సినిమాను చేస్తున్నాడు సంగీత్ శోభన్. ఈ సినిమాకు షైన్ స్క్రీన్స్ సాహ గారపాటి నిర్మాత.
ప్రణవ్ రావు ‘సాహో’కి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ తర్వాత ‘మ్యాడ్’ సినిమాలకు కోరైటర్, చీఫ్ ఏడీగా చేశారు. ఆ సమయంలో ఉన్న పరిచయంతోనే సంగీత్‌కి ఈ కథ చెప్పి ఓకే చేసుకున్నారని సమాచారం. ఈ సినిమా గత సినిమాల్లా వినోదాత్మకంగానే ఉంటుంది అని సమాచారం. త్వరలో సినిమాను అనౌన్స్ చేసినప్పుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తారని సమాచారం. ఇది కాకుండా సంగీత్ మరో సినిమాను కూడా ఓకే చేశాడని టాక్.












