బాలీవుడ్ జనాలు ఒక సినిమాని ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తే దానికి కారణాలు ఏంటని విశ్లేషించుకోకుండా.. కొత్త అర్ధాలు తీసి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలే విడుదలైన ‘షంషేరా’ బాక్సాఫీస్ వద్ద ఎంత దారుణంగా ప్లాప్ అయిందో తెలిసిందే. కేవలం మూడో రోజుకే జనాలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ తో యష్ రాజ్ లాంటి సంస్థ తీసిన సినిమా ఇది.
ఈ విజువల్ గ్రాండియర్ కు ఇంత దారుణమైన ఫలితం వస్తుందని ఎవరూ ఊహించలేదు. సినిమా ఫెయిల్ అయిందని వదిలేయకుండా.. దర్శకుడు కరణ్ మల్హోత్రా, విలన్ గా నటించిన సంజయ్ దత్.. సినిమా ప్లాప్ అవ్వడానికి కొత్త అర్ధాలు తీసుకొస్తున్నారు. కొందరు అకారణంగా ‘షంషేరా’ సినిమా మీద ద్వేషం పెంచుకున్నారని.. సినిమా చూడని వాళ్లు సైతం నెగెటివిటీను పంచడానికి పూనుకున్నారని కామెంట్స్ చేశారు. మేం పడ్డ కష్టాన్ని గుర్తించకుండా ఇంత నెగెటివిటీను స్ప్రెడ్ చేయడం బాధ కలిగించిందని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
అయితే ఈ పోస్ట్ లపై త్రిల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. అసలు కంటెంటే లేని సినిమా అని.. ఎంతో నాసిరకంగా ఉందని.. దాన్ని నిజాయితీ ఒప్పుకొని ఉంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తీయకుండా.. వారినే టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం కొత్త ట్రెండ్ అయిపోయిందంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో ‘అగ్నిపథ్’ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన దర్శకుడు నుంచి ఇలాంటి అవుట్ పుట్ ఎవరూ ఆశించరు.
దీంతో సహజంగానే అసంతృప్తి కొంత ఎక్కువ మోతాదులో బయటకొచ్చింది. సినిమాలో సంజయ్ దత్ చేసిన ఓవరాక్షన్ ‘షంషేరా’కి మైనస్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అలాంటిది ఇప్పుడు ఆయన ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టడంతో మరింత ట్రోలింగ్ కి గురవుతున్నారు.