ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘లియో’ చిత్రం మేనియా నే కనిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళ హీరో సినిమా టికెట్స్ కోసం ఇంత డిమాండ్ ఉండడం రీసెంట్ సమయం లో ఎప్పుడూ చూడలేదు. తమిళం లో ఎలాగో ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ రాబోతున్నాయి, అలాగే తెలుగు లో కూడా ఈ చిత్రానికి డబ్బింగ్ సినిమాలలో ఆల్ టైం రికార్డు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చిత్రానికి ఇంత హైప్ రావడానికి కారణం లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించడమే.
గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘మాస్టర్’ అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. ఈ సినిమా తర్వాత లోకేష్ కమల్ హాసన్ తో ‘విక్రమ్’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చి సుమారుగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం కాబట్టే ‘లియో’ మీద ఇంత హైప్ ఏర్పడింది.
ఇకపోతే ఈ సినిమాలో ఆంటోనీ దాస్ అనే మెయిన్ విలన్ క్యారక్టర్ ని ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పోషించాడు. ఈ పాత్ర సినిమాకి హైలైట్ కాబోతుంది అట. ఈ పాత్రలోనే అనేక ట్విస్టులు ఉంటాయని అంటున్నారు. అయితే ముందుగా ఈ పాత్ర కోసం సంజయ్ దత్ ని అనుకోలేదట. సీనియర్ హీరో మోహన్ బాబు ని ఈ పాత్ర కోసం అనుకున్నారట.
కానీ విజయ్ కి మాత్రం మోహన్ బాబు కంటే (Sanjay Dutt) సంజయ్ దత్ బెస్ట్ ఛాయస్ అనిపించి ఆయనని ఒకసారి సంప్రదించండి అని అడిగాడట. విజయ్ చెప్పిన మాట ప్రకారమే సంజయ్ దత్ ని కలిసి స్టోరీ వివరించాడట లోకేష్ కనకరాజ్. కేవలం పది నిమిషాల స్టోరీ లైన్ ని విని వెంటనే ఓకే చెప్పి డేట్స్ ఇచ్చేశాడట. అలా మోహన్ బాబు చెయ్యాల్సిన పాత్ర సంజయ్ దత్ కి చేరింది.