బాలయ్య కు విలన్ గా సీనియర్ హీరోని తీసుకున్న బోయపాటి..!

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రూలర్’ చిత్రం డిసెంబర్ 20న విడుదల కాబోతుంది. ఇది బాలకృష్ణకు 105 వ చిత్రం. ఈ చిత్రం తర్వాత తన 106 వ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ బ్లాక్ బస్టర్లు కావడంతో ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బోయపాటి చిత్రాల్లో హీరోతో సమానంగా విలన్ లకి ప్రాధాన్యత ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. అందుకే కొంత క్రేజ్ ఉన్న హీరోలనే విలన్ లుగా ఎంచుకుంటూ ఉంటాడు బోయపాటి.

‘లెజెండ్’ సినిమాలో జగపతి బాబుని విలన్ గా ఇంట్రడ్యూస్ చేసి అతని సెకండ్ ఇన్నింగ్స్ కు మంచి బూస్టప్ ఇచ్చాడనే చెప్పాలి. అటు తరువాత ‘సరైనోడు’ చిత్రంలో ఆది ను కూడా విలన్ గా ప్రెజెంట్ చేసి.. అతని క్రేజ్ మరింత పెరగడానికి కారణమయ్యాడు. ఇప్పుడు బాలయ్య 106 సినిమాలో కూడా ఓ సీనియర్ హీరోని విలన్ గా చూపించడానికి రెడీ అవుతున్నాడట. ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా సంజయ్ దత్ కనిపిస్తుండగా మరో విలన్ గా హీరో శ్రీకాంత్ ను తీసుకున్నాడని సమాచారం.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus