‘అధీరా’ ఈజ్ బ్యాక్!

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కి ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. క్యాన్సర్ మూడో దశలో ఉన్నట్లు తెలియడంతో మరింత టెన్షన్ పెరిగిపోయింది. దీంతో వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించారు వైద్యులు. అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో సంజయ్ దత్ ఇక సినిమాలు చేస్తారా..? చేయరా..? అనే విషయంలో సందేహాలు మొదలయ్యాయి. ఆయన నటిస్తోన్న సినిమాలన్నీ కూడా వందల కోట్లతో తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ మొదలుపెట్టని సినిమాలకు పెద్ద సమస్య ఉండదు.

కావాలంటే వేరే వాళ్లను తీసుకోవచ్చు. కానీ సంజయ్ దత్ ఇప్పటికే నటిస్తోన్న భారీ సినిమాల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్నింటికంటే ‘కేజీఎఫ్2’ సినిమా విషయంలో పలు ప్రశ్నలు తలెత్తాయి. ఆ సినిమాకి సంబంధించి సంజయ్ దత్ పై మరిన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండడంతో చిత్ర యూనిట్ అయోమయంలో పడింది. ప్రస్తుతం పరిస్థితుల్లో షూటింగ్ లో పాల్గొనమని సంజయ్ ని అడగలేరు. దీంతో వారు సైలెంట్ గా ఉండిపోయారు. పరిస్థితి అర్ధం చేసుకున్న సంజయ్ దత్ ఓ పక్క క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. ఆ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.

శుక్రవారం నాడు ‘కేజీఎఫ్-2’ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలో ‘అధీరా’ అనే ముఖ్య పాత్రలో సంజయ్ నటించనున్న సంగతి తెలిసిందే. షూటింగ్ లో పాల్గొన్న సందర్భంగా ఆయనే ఓ ఫోటో షూట్ లో పాల్గొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో షూట్ అభిమానులకు ఎంతో ఆనందాన్నిస్తోంది. తనకు ఎంత బాధ ఉన్నప్పటికీ సినిమా పూర్తి చేయడానికి బయటకొచ్చిన సంజయ్ దత్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ సంజూకి జాగ్రత్తలు చెబుతున్నారు నెటిజన్లు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus