సంక్రాంతి సినిమాల ఓటీటీ డేట్స్‌ ఇవేనా? త్వరలోనే క్లారిటీ!

  • January 31, 2024 / 01:54 PM IST

ఎప్పుడూ లేనట్లు 2024 సంక్రాంతికి 4 సినిమాలు బరిలోకి దిగాయి. అందులో ఎన్ని సినిమాలు విజయాలు సాధించాయి, ఎన్ని రికార్డు వసూళ్లు సాధించాయి, ఎన్ని తుస్‌మన్నాయి అనే చర్చ ఇప్పుడు పెట్టుకుంటే ముందుకెళ్లేది కాదు. ఒక్క సినిమా మినహా అన్నీ భారీ విజయం అందుకున్నాం అని చెబుతోంది. వసూళ్ల లెక్కలు రెండు సినిమాలు చెబుతున్నాయి. ఒక సినిమా ఆ లెక్క చెప్పలేదు కానీ… మేం అనుకున్నంత వసూళ్లు వచ్చాయి అని అంటోంది. ఆ విషయం పక్కనపెడదాం… ఇప్పుడు ఆ సినిమాల ఓటీటీ డేట్స్‌ గురించి చూద్దాం.

బాక్సాఫీస్‌ దగ్గర మంచి కిక్ ఇచ్చిన సినిమాల ఓటీటీ ప్రీమియర్ల కోసం అభిమానులు ఎదురు చూడటం ఇప్పుడు సర్వసాధారణం. అక్కడ సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు, ఒకసారి చూసి మరోసారి చూద్దాం అంటే టికెట్‌ రేట్లు చూసి జడుసుకున్నవాళ్లు ఓటీటీలవైపు దృష్టిసారిస్తారు. అలా సంక్రాంతి సినిమాలు ఓటీటీల తేదీల గురించి వెయిట్‌ చేస్తున్న ఓటీటీయన్లకు ఇదిగో ఇప్పటివరకు ఉన్న సమాచారం.

ఒక్క ‘హనుమాన్’ మినహా మిగిలిన అన్ని సినిమాలు వీలైనంత త్వరగా ఓటీటీల్లోకి వచ్చేయాలని చూస్తున్నాయి. ఎందుకంటే ఇంకా ‘హను – మాన్‌’కి థియేటర్లలో మంచి రన్నే నడుస్తోంది. దీంతో ఆ సినిమా ఓటీటీని పొట్టి నెలలో (ఫిబ్రవరి) కాకుండా మూడో నెలలోకి తీసుకెళ్తున్నారు. మార్చి రెండో వారంలో ఆ సినిమా జీ5లో వస్తుందట. ఇక వెంకటేష్‌ ప్రెస్టీజియన్‌ 75వ సినిమా ‘సైంధ‌వ్‌’ తొలుత ఓటీటీలోకి వచ్చేస్తుంది అంటున్నారు. ఫిబ్రవరి 2 అమెజాన్ ప్రైమ్‌లో సినిమా రావొచ్చని టాక్.

ఇక నాగార్జునకి ‘నా సామిరంగ’ సినిమాను ఫిబ్రవరి 15న స్ట్రీమింగ్‌కు వచ్చేలా చూస్తోందట డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్. ఇక మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ ‘గుంటూరు కారం’ సినిమాను అయితే ఫిబ్రవరి 9 నుండి నెట్ ఫ్లిక్స్‌లో చూసేయొచ్చు అంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. అయితే అన్నీ ఫిబ్రవరి రెండో వారం లోపే ఓటీటీలోకి వచ్చేస్తాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలు చాలా వరకు 28 రోజుల కాన్సెప్ట్‌లో ఓటీటీ ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus