నితిన్ (Nithiin) హీరోగా ‘రాబిన్ హుడ్’ (Robinhood) వచ్చింది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మ్యాట్నీలకే జనాలు లేక థియేటర్లు ఖాళీ అయిపోయాయి. నెక్స్ట్ రోజుకే సినిమా డిజాస్టర్ అని ట్రేడ్ పండితులు సైతం తేల్చేశారు. నితిన్ ప్లాపులకి ఈ సినిమా బ్రేకులు వేయలేకపోయింది. ‘భీష్మ’ తో (Bheeshma) నితిన్ ని ప్లాపుల నుండి బయటపడేసిన దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) .. ‘రాబిన్ హుడ్’ తో మాత్రం నితిన్ కు సక్సెస్ ఇవ్వలేకపోయాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి ప్రెస్టీజియస్ బ్యానర్ ఈ సినిమాని రూ.70 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది.
శ్రీలీల (Sreeleela) వంటి స్టార్ హీరోయిన్ నటించినా, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ క్రికెటర్ గెస్ట్ రోల్ చేసినా.. ‘రాబిన్ హుడ్’ జనాల మనసులు దోచుకోలేకపోయాడు. థియేటర్లలో సరే.. ఆడలేదు. కనీసం ఈ సినిమాని ఓటీటీలో అయినా చూద్దామని ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా ‘రాబిన్ హుడ్’ ఓటీటీలోకి రాలేదు.
ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను ‘జీ’ సంస్థ కొనుగోలు చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) వంటి బ్లాక్ బస్టర్ ను కూడా ఈ సంస్థే కొనుగోలు చేసింది. థియేట్రికల్ రన్ తర్వాత ముందుగా టీవీల్లో టెలికాస్ట్ చేసి అటు తర్వాత ‘జీ5’ లోకి తెచ్చారు. అందువల్ల టీఆర్పీ రేటింగ్ చాలా బాగా వచ్చింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి..!
ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ విషయంలో కూడా అదే ఫార్ములా అప్లై చేస్తుంది. అవును ఈ సినిమాని ముందుగా టెలివిజన్ ప్రీమియర్ ను మే 10న సాయంత్రం 10 గంటలకి టెలికాస్ట్ చేసి.. తర్వాత ‘జీ5’ లోకి దింపాలని చూస్తుంది. మరి ‘రాబిన్ హుడ్’ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ రేంజ్లో టీఆర్పీ రేటింగ్ వస్తుందో లేదో చూడాలి.