టాలీవుడ్ సక్సెస్-ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) కొన్నాళ్లుగా సరైన హిట్టు లేక అల్లాడిపోతున్నారు. ‘శాకుంతలం’ (Shaakuntalam) ‘ది ఫ్యామిలీ స్టార్’ (Family Star) వంటి సినిమాలు ఆయన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆయన రెండో బ్యానర్లో చేసిన ‘లవ్ మీ’ (Love Me) ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) వంటి సినిమాలు కూడా నిరాశపరిచాయి. దీంతో దిల్ రాజు పని అయిపోయింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. దీంతో 2025 సంక్రాంతి సినిమాలపైనే ఆయన హోప్స్ పెట్టుకున్నారు. దిల్ రాజుకి సంక్రాంతికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.
ఆయన నిర్మాణంలో రూపొంది సంక్రాంతి టైంలో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) ‘ఎఫ్ 2’ (F2 Movie) ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే ‘గేమ్ ఛేంజర్’ (Game changer) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాల్ని 2025 సంక్రాంతికి దింపారు. అయితే వీటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయడం లేదు.
పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినా ‘గేమ్ ఛేంజర్’ కి ఫుల్ రన్లో రూ.150 కోట్లు షేర్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు నష్టాలు మిగల్చడం ఖాయమని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే తర్వాత వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. తక్కువ థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా 3 రోజుల్లోనే రూ.100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.
వీకెండ్ ఇంకా మిగిలే ఉంది కాబట్టి.. ఈ సినిమా మరింత కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ గా ఈ సినిమా రూ.70 కోట్ల ప్రాఫిట్స్ అందించినా దిల్ రాజు చాలా వరకు గట్టెక్కినట్టే అని చెప్పాలి. అందుకే ‘గేమ్ ఛేంజర్’ కోసం హోల్డ్ చేసిన థియేటర్లు ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో రీప్లేస్ చేస్తూ వస్తున్నారు దిల్ రాజు. ఏదేమైనా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ తో ఆయన బౌన్స్ బ్యాక్ అయినట్టే అని చెప్పాలి.