Santosh Shoban: సంతోష్‌ శోభన్‌ ఖాతాలో మరో సినిమా పడిందా!

‘ఏక్‌ మినీ కథ’తో హీరోగా బ్రేక్‌ సాధించాడు సంతోష్‌ శోభన్‌. ఆ తర్వాత వరుసగా అవకాశాలు సంపాదిస్తున్నాడు. వైజయంతి మూవీస్‌ లాంటి పెద్ద బ్యానర్‌లో ఛాన్స్‌ కొట్టేశాడు. ఇప్పుడు మెగా కాంపౌండ్‌లోకి కూడా ప్రవేశించబోతున్నాడని సమాచారం. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మించబోయే కొత్త సినిమాలో సంతోష్‌ శోభన్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నారని సమాచారం. సుస్మిత ఇటీవల సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళంలో మంచి విజయం సాధించిన ‘8 తొట్టక్కళ్‌’ అనే సినిమా హక్కుల్ని కొనుగోలు చేశారు.

‘గోల్డ్ బాక్స్ ఎంట‌ర్టైన్మెంట్’ పేరుతో తన భ‌ర్త విష్ణుతో క‌లిసి ఓ వెబ్ సిరీస్ కూడా నిర్మించింది. ఇప్పుడు అదే బ్యానర్‌లో సినిమా తీస్తున్నారు. అందులోనే సంతోష్‌ శోభన్‌ను హీరోగా ఎంచుకున్నారట. ఈ సినిమాను తమిళలో తెరకెక్కించిన శ్రీ గణేషే ఇక్కడా దర్శకత్వం వహిస్తారట. చర్చించడానికి, ఆలోచించడానికి, నటించడానికి భయపడే కథను ఎంచుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంతోష్‌ శోభన్‌. ఇప్పుడు పోలీసుగా ఎలా నటిస్తాడనేది ఆసక్తికరం.

ఎందుకంటే ‘8 తొట్టక్కళ్‌’లో హీరో పోలీసు. ఈ సినిమాలో హీరో నేర‌స్థుడిని ప‌ట్టుకునే క్ర‌మంలో రివాల్వ‌ర్ పోగొట్టుకుంటాడు. దాన్ని దొంగిలించిన వ్య‌క్తి మ‌రొక‌రికి అమ్ముతాడు. దీంతో క‌థ అనూహ్య మ‌లుపులు తిరుగూతూ, ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus