వాట్‌ ఏ ట్విస్ట్‌.. ఓవర్‌నైట్‌లో మెయిన్‌ యాక్టర్‌ అయిపోయిన నార్మల్‌ యాక్టర్‌!

సినిమా పరిశ్రమ చాలా గొప్పది. ఎవరినైనా హీరోలను చేసేది పరిశ్రమే, హీరోలుగా ఉన్నవారికి సరైన ఫలితం రాకపోతే జీరోలను చేసేది కూడా సినిమా పరిశ్రమే. సినిమా ఫలితం కాస్త అటు ఇటు అయితే మొత్తంగా పరిస్థితి తారుమారు అయిపోతుంది. ఇదంతా ఒకవైపు ఉంటే.. ఓ సినిమా ఫలితం హఠాత్తుగా సైడ్‌ యాక్టర్‌ను మెయిన్‌ యాక్టర్‌ని చేసేస్తుంది. సినిమా కథలో మార్పులు కుదరవు కాబట్టి.. ప్రచారంలో స్టార్‌ అయిపోతారు. వారి చుట్టూనే సినిమా ప్రమోషన్లు అన్నీ నడుస్తాయి.

Sara Arjun

ఈ విషయంలో మీకేమైనా డౌట్‌ ఉంటే ‘యుఫోరియా’ సినిమా టీమ్‌ చేస్తున్న ప్రచారం చూడండి మీకే అర్థమైపోతుంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ ఈ సినిమా కొన్ని నెలల క్రితం ప్రారంభించారు. ఈ సినిమాతో 20 ఏళ్ల తర్వాత తమ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతోంది అంటూ భూమిక గురించి గొప్పగా చెప్పారు గుణశేఖర్‌. అందుకు తగ్గట్టుగా సినిమా ప్రారంభం నుండి ప్రచారం చేస్తూనే ఉన్నారు. నిన్న మొన్నటివరకు అంటే డిసెంబరు రెండో వారం వరకు ఇలానే భూమిక ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా అనే చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత నుండి ‘యుఫోరియా’ అంటే భూమిక సినిమా అనే యాంగిల్‌లో పోస్టర్లు, వీడియోలు రిలీజ్‌ చేసి ప్రచారం చేశారు. ఆమె కూడా అలానే ప్రచారం చేశారు. సడన్‌గా సినిమా ప్రచారం ఆపేశారు. పండగ సినిమాలు బిజీ ఉంది కదా.. ఆ తర్వాత చేస్తారేమో అనుకుంటే అలానే చేశారు. కానీ ఇప్పుడు సారా అర్జున్‌ ‘యుఫోరియా’ అని చెబుతున్నారు.

కారణమేంటో మీకు తెలిసే ఉంటుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్‌ సినిమా ‘ధురంధర్‌’ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం అందుకుంది. దీంతో ఆమె ప్రధాన పాత్రగా సినిమా ప్రచారాన్ని మార్చి.. ఫిబ్రవరి 6న విడుదల చేస్తున్నారు. చూద్దాం ఈ ప్రయత్నం ఫలిస్తుందేమో. ఇది వర్కవుట్‌ అయితే గౌతమ్‌ తిన్ననూరి – నాగవంశీ సినిమా ‘మ్యాజిక్‌’ కూడా ఇలానే సారా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా వస్తుందేమో.

టాలీవుడ్‌కి ఈ సంక్రాంతి నేర్పిన పాఠమిదే.. అయితే ఓవర్‌ డోస్‌ కాకూడదమ్మా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus