ఎన్నో అంచనలతో విడుదలయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా కధ క్లైమ్యాక్స్ కి వచ్చింది. పవన్ కళ్యాన్ అత్తారింటికి దారేది చిత్రం తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని పవర్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేసిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఉగాది రోజు థియేటర్లో హల్‌చల్ చేసింది. అయితే అప్పటికే పవన్ కు అత్తారింటికి దారేది భారీ హిట్ కావడం, మరో పక్క పవన్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అందరూ ఆశించారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలకు ముందే మొత్తం బిజినెస్ 100 కోట్లు చేసింది.
ఇక ఈ విషయం తెలియడంతో డిస్ట్రిబ్యూటర్లు పోటీలు పడి సినిమాను కొనేశారు. ఇంతవరకూ బాగానే ఉంది, భారీ అంచనాలతో విడుదలయిన ఈ సినిమా అంచనాలను తల్లకిందులు చేస్తూ… బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు సినిమా థియేటర్ హక్కులను రూ. 87 కోట్లు పెట్టి కొన్నారు. కానీ, ఈ రెండు రాష్ట్రాలలో కలిపి అందులో సగం కూడా రాలేదు. టాలీవుడ్ లెక్కల ప్రకారం చూస్తే…ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కూడా విడుదల చేసినా, అంతా కలిపి సినిమాకు వచ్చినది కేవలం రూ. 52.92 కోట్లు మాత్రమే. అయితే ఈ నష్టాన్ని తగ్గించేందుకు పవన్ డిస్ట్రిబ్యూటర్లు బాధ అర్ధం చేసుకుని ఎస్.జే సూర్యతో తాను చేయబోతున్న నెక్స్ట్ సినిమాతో ఈ సినిమా నష్టాలకు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారని టాక్. ఏది ఏమైనా..చివరకు సర్దార్ అందరికీ నష్టాలానే మిగిల్చింది అన్నది తెలిపోయింది.