కార్తి హీరోగా ‘అభిమన్యుడు’ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్దార్’.ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. రాశి ఖన్నా , రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కింగ్ అక్కినేని నాగార్జున తన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ద్వారా విడుదల చేశారు.
మొదటి రోజు ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.సినిమా చూసిన ప్రతి ఒక్కరూ టాక్ బాగానే చెప్పారు. దీంతో మొదటి వారం ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది.10వ రోజు కూడా ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. ఒకసారి ‘సర్దార్’ 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
2.85 cr
సీడెడ్
0.84 cr
ఉత్తరాంధ్ర
1.05 cr
ఈస్ట్+వెస్ట్
0.66 cr
కృష్ణా + గుంటూరు
0.91 cr
నెల్లూరు
0.42 cr
ఏపి+ తెలంగాణ
6.73 cr
‘సర్దార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 10 రోజులు పూర్తయ్యేసరికి రూ.6.73 కోట్ల షేర్ ను రాబట్టి బయ్యర్స్ కు రూ.1.83 కోట్ల లాభాలను అందించింది.
‘కాంతార’ ఎఫెక్ట్ లేకపోతే ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసుండేది అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ పోటీలో కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను అందించింది.