‘సరిలేరు నీకెవ్వరు’ డే 1 ట్రేడ్ ఎక్స్పెక్టేషన్స్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న(రేపు) విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వింటేజ్ మహేష్ బాబు ని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి అనేక సార్లు చెప్పుకొచ్చాడు. దీంతో మహేష్ అభిమానులే కాదు మాస్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎగబడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. దీంతో మొదటి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

పాన్ ఇండియా చిత్రాలు అయిన ‘బాహుబలి'(సిరీస్) , ‘సాహో’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాలని పక్కన పెడితే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 28 కోట్ల నుండీ 30 కోట్ల వరకూ షేర్ ను రాబట్టడం ఖాయం అంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇవి కచ్చితంగా మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ మౌత్ టాక్ బాగా వస్తే… ఈవింగ్ షో ల నుండీ ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని వారు చెబుతున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా 40కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసే అవకాశం కూడా ఉందని వారు చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఎంత నిజమైందో మరో 24 గంటల్లో తెలుస్తుంది.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus