‘సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ రోల్ …?

మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు టూర్ వెళ్ళాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ కోసం ఓ కీలక సెట్ వేయిస్తున్నారు దర్శక నిర్మాతలు. దీంతో గ్యాప్ వచ్చింది… అందుకే టూర్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్. ఇక దసరా కానుకగా ‘సరిలేరు నీకెవ్వరు’ నుండీ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో గొడ్డలి పట్టుకుని కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద మహేష్ నిలబడి ఉంటాడు.

బోర్డర్ లో ఉండే ఓ మేజర్ ఇలా గొడ్డలి పట్టుకుని ఉండడమేంటి..? అని అప్పటి నుండీ డిస్కషన్లు మొదలయ్యాయి. మహేష్ ఓ ఫ్యాక్షనిజం ఫ్యామిలీ కి చెందిన వారసుడు అని ఈ ఫైట్ తో రెవీల్ అవుతుందట. ఈ ఫైట్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని.. దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో శ్రద్ధతో ఈ ఫైట్ చిత్రీకరించాడని తెలుస్తుంది.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus