‘సరిలేరు నీకెవ్వరు’ కి ఈ ‘ఆగడు’ సెంటిమెంట్లేంటి బాబు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన ‘దూకుడు’ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘పోకిరి’ తర్వాత ఐదేళ్ళ వరకూ హిట్టులేకపోవడంతో ఇక మహేష్ పని అయిపొయింది అనుకున్న తరుణంలో ‘దూకుడు’ వచ్చి ఆ కామెంట్స్ కు బ్రేక్ వేసింది. తెలుగు సినిమాల్లో అదీ యూ.ఎస్ లో 1మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన మొదటి చిత్రం ‘దూకుడు’ కావడం విశేషం. అలాంటి కాంబినేషన్ నుండీ ఓ సినిమా వస్తుందంటే ఇంకెంత హైప్ ఉంటుంది చెప్పండి. రికార్డులు బద్దలు కొట్టేస్తుంది అని అంతా ఫిక్సయిపోయారు. ఈ క్రమంలో ‘ఆగడు’ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ సినిమా మాత్రం పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. చాలావరకూ ఈ చిత్రం కూడా ‘దూకుడు’ లానే ఉండడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు. కానీ ‘దూకుడు’ కాంబినేషన్ కావడంతో ‘ఆగడు’ యూ.ఎస్ లో ప్రీమియర్స్ కే $ 500K డాలర్లను వసూల్ చేసి రికార్డు సృష్టించింది. అంటే ప్రీమియర్స్ కే హాఫ్ మిలియన్ కొల్లగొట్టిన మొదటి చిత్రం కూడా వీరి కాంబినేషన్లోనే వచ్చింది. అంతేకాదు ‘ఆగడు’ ఓవర్సీస్ బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని కూడా యూ.ఎస్ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నాడు అనిల్ సుంకర. ఈ చిత్రానికి దిల్ రాజు తో పాటు, అనిల్ సుంకర కూడా మరో నిర్మాత. తాజాగా అనిల్ సుంకర సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ..’ ‘ఆగడు’ హైప్ తో ‘దూకుడు’ కంటెంట్ తో వస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. అంటే ‘దూకుడు’ తో కూడుకొన్న కంటెంట్ తో వస్తున్నాం అన్నాడా.. లేక మళ్ళీ ‘దూకుడు’ కంటెంట్ తోనే వస్తున్నాం అన్నాడా అనేది అర్ధంకాక మహేష్ ఫ్యాన్స్ అయోమయంలోనూ అలానే టెన్షన్లోనూ ఉన్నారని తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే… ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ‘ఆగడు’ ఫస్ట్ హాఫ్ కు వర్క్ చేశాడు. ఇక ‘ఆగడు’ హీరోయిన్ తమన్నా కూడా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందనే ప్రచారం కూడా నడుస్తుంది. మరి ఈ చిత్రం ఫలితం ఏమవుతుందో తెలియాలంటే 2020 సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే..!

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus