‘సరిలేరు నీకెవ్వరు’ 17 డేస్ కలెక్షన్స్…!

  • January 29, 2020 / 07:18 PM IST

3 వ వారంలోకి ఎంటర్ అయినప్పటికీ.. ‘సరిలేరు’ జోరు ఇప్పటికీ తగ్గలేదనే చెప్పాలి. ఇప్పటికీ ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది. ఇప్పటికే ‘నాన్ బాహుబలి’ ఇండస్ట్రీ హిట్ అయిన ‘రంగస్థలం’ కలెక్షన్లను అధిగమించిన ఈ చిత్రం 3వ సోమవారం రోజున కూడా 0.89 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ఎక్కువ థియేటర్లు దక్కుతుండడం.. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తక్కువ థియేటర్లలో మాత్రమే ప్రదర్శింపబడుతోన్నప్పటికీ… బాగా కలెక్ట్ చేస్తుండడం విశేషం.

ఇక 17 రోజులు పూర్తయ్యేసరికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 37.12 cr
సీడెడ్ 14.99 cr
ఉత్తరాంధ్ర 18.77 cr
ఈస్ట్ 10.90 cr
వెస్ట్ 7.17 cr
కృష్ణా 8.53 cr
గుంటూరు 9.55 cr
నెల్లూరు 3.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 9.18 cr
ఓవర్సీస్ 11.83 cr
వరల్డ్ వైడ్ టోటల్ 131.90 cr (share)

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిది. 7 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 17 రోజులు పూర్తయ్యేసరికి 131.90 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. మహేష్ కెరీర్లోనే ఇవి హైయెస్ట్ కలెక్షన్లని చెప్పాలి. ఈ చిత్రానికి రేటింగ్ లు ఎక్కువ పడినప్పటికీ.. ‘అల వైకుంఠపురములో’ చిత్రం పోటీని తట్టుకుని మరీ మంచి కలెక్షన్లను రాబడుతుంది.

Click Here To Sarileru Neekevvaru Movie Review

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus