లేడీ యం.యల్.ఎ తో బన్నీ స్టెప్స్ వేయడానికి అయిన ఖర్చు 2.5 కోట్లు
- February 20, 2016 / 11:24 AM ISTByFilmy Focus
బోయపాటి శీను డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సరైనోడు’. బన్నీ సరసన కేథరిన్ త్రేసా సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. బన్నీ, కేథరిన్ మధ్య తాజాగా ఓ పాటను ప్లాన్ చేసారు దర్శకుడు బోయపాటి. అయితే..ఈ పాట సెట్ కోసం రూ.1.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అంతేగాక..పాట పూర్తయ్యేసరికి మొత్తం తేలే ఖర్చు రూ.2.5 కోట్లు. ఒక్క పాట కోసం ఇంత భారీ బడ్జెటా..!అంటూ ఫిలిం నగర్ జనాలు నోరెళ్ళబెట్టారు. అంతగా ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే..మొత్తం 300 మంది డాన్సర్లు, బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ బోస్కో ఆధ్వర్యంలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.
ఇక కేథరిన్ ఈ చిత్రంలో ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అల్లు అర్జున్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ ఎమ్మెల్యే, పోలిస్ మధ్య డాన్స్ ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది.ఇక ‘సరైనోడు’ ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరి 18న విడుదల చేసి సినిమాను సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉంది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












