మహేష్ మూవీ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ విషయంలో మహేష్ దర్శక నిర్మాతలు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఏకంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. దానికి కారణం ప్రస్థుతం నెలకొన్న పరిస్థితులే అని తెలుస్తుంది. షూటింగ్స్ కి అనుమతి ఇచ్చినా, అనేక ఆంక్షలు అమలులో ఉన్నాయి.
దానికి తోడు మహేష్ లాంటి స్టార్ మూవీని కొద్దిమంది సిబ్బందితో షూటింగ్ నిర్వహించడం వీలు కాదు. అలాగే అంతకంతకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న తరుణంలో కొద్దిరోజులు ఆగడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే మహేష్ మూవీ లేటైందని భావిస్తున్న ఫ్యాన్స్ కి ఇది మరింత ఇబ్బంది పెట్టే అంశం అని చెప్పొచ్చు. డిసెంబర్ లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళితే విడుదలకు వచ్చే ఏడాది చివర్లో లేదా 2022 ప్రారంభంలో ఉండే అవకాశము ఉంది, కాబట్టి మహేష్ సర్కారు వారి పాట ఫ్యాన్స్ ఊహించినంత తొందరగా రాకపోవచ్చు.
అలా దాదాపు ఏడాదిన్నర తరువాత ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇది ఫ్యాన్స్ కి ఒకింత నిరాశ పరిచే అంశమే. ఈ చిత్రం తర్వాత రాజమౌళి తో మహేష్ మూవీ చేస్తుండగా, ఆ ప్రాజెక్ట్ మరో రెండు మూడేళ్లు సమయం తీసుకోనుంది. కాబట్టి రానున్న కాలంలో మహేష్ నుండి సినిమాలు చాల నెమ్మదిగా రానున్నాయన్న మాట.