మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలైంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి. మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు మంచి కలెక్షన్లను సాధించింది.రెండో రోజు కూడా పర్వాలేదు అనిపించింది. పలు చోట్ల వర్షాలు పడటం, అలాగే నైజాంలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడలేదు.
‘సర్కారు వారి పాట’ 2 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం | 17.44 cr |
సీడెడ్ | 6.05 cr |
ఉత్తరాంధ్ర | 6.27 cr |
ఈస్ట్ | 4.33 cr |
వెస్ట్ | 3.19 cr |
గుంటూరు | 6.34 cr |
కృష్ణా | 3.13 cr |
నెల్లూరు | 1.97 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 47.72 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.31 cr |
ఓవర్సీస్ | 7.75 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 58.78 cr |
‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి రూ.58.78 కోట్ల షేర్ ను రాబట్టింది ఈ చిత్రం. నిన్న వర్కింగ్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసింది. శని, ఆది వారాలు మరింతగా కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.62.22 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది ఈజీ టార్గెట్ అయితే కాదు. వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి, అలాగే వీక్ డేస్ లో కూడా బాగా రాణించాలి.
Most Recommended Video
మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!