Mahesh Babu: సర్కారుతో మహేష్ కొత్త రికార్డులు సాధిస్తారా?

మరో 40 రోజుల్లో థియేటర్లలో సర్కారు వారి పాట రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. వరుసగా విజయాలు సాధిస్తున్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో కూడా మరో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాకు రైల్వే స్టేషన్ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Click Here To Watch NOW

గీతా గోవిందం సినిమాతో సత్తా చాటిన పరశురామ్ సర్కారు వారి పాట సినిమాతో కూడా సక్సెస్ సాధించి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరుతాననే నమ్మకంతో ఉన్నారు. హైదరాబాద్ లో రైల్వే స్టేషన్ సెట్ స్పెషల్ గా వేసి ఈ సీన్ ను షూట్ చేశారని బోగట్టా. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైందని ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందో యాక్షన్ సీక్వెన్స్ లకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

మే 12వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను స్పెయిన్, గోవా, దుబాయ్ లలో షూట్ చేశారు. ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్న సంగతి తెలిసిందే. సర్కారువారి పాట సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కీర్తి సురేష్ కోరుకుంటున్నారు. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే స్టార్ హీరోల సినిమాలలో మరిన్ని ఆఫర్లు వస్తాయని కీర్తి సురేష్ భావిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. సమ్మర్ హాలిడేస్ ను ఈ సినిమా సద్వినియోగం చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus