SVP Trailer: మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చే ట్రైలర్..!

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వింటేజ్ మహేష్ కనిపిస్తాడని టీం అంతా ముందు నుండీ చెబుతూనే ఉంది. వాళ్ళ మాటలు నిజమే అని ట్రైలర్ ఆశలు కల్పిస్తుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే :

‘యు కెన్ స్టీల్ మై లవ్.. నా ప్రేమని దొంగిలించగలవ్
యు కెన్ స్టీల్ మై ఫ్రెండ్ షిప్… నా స్నేహాన్ని దొంగిలించగలవ్
యు కాంట్ స్టీల్ మై మనీ.. !’ అంటూ మహేష్ చెప్పే డైలాగులతో ట్రైలర్ మొదలైంది.

‘అమ్మాయిల్ని అప్పించే వాళ్ళని పాంపర్ చేయ్యాలి రా..రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు ఆ నెక్స్ట్’ అంటూ క్యాచీ డైలాగ్ చెప్పాక హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ ను చూపించారు. 46 ఏళ్ళ ఏజ్ లో మహేష్ ఇంత ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు అని ఎవ్వరూ ఊహించి ఉండరు.

మరోపక్క సముద్రఖని విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా మహేష్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు.

‘థిస్ ఈజ్ మహేష్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపల గూడ బీచ్ సర్’, ‘అప్పనేది ఆడపిల్ల లాంటిది సర్.. ఇక్కడ ఎవ్వడూ బాధ్యత ఉన్న ఆడపిల్ల తండ్రిలా బిహేవ్ చేయడం లేదు’, ‘ఓ వంద వియాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్ళికొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు’ వంటి డైలాగులు హైలెట్ గా నిలిచాయి. తమన్ నేపధ్య సంగీతం, మది సినిమాటోగ్రఫీ అదుర్స్ అనిపించాయి.

టోటల్ గా ట్రైలర్ లో చాలా మాస్ స్టఫ్ ఉంది. చాలా వరకు రిపీట్స్ పడే అవకాశం ఉంది. సినిమా పై ఉన్న అంచనాలను కూడా డబుల్ చేసే విధంగా ఉంది ఈ ట్రైలర్. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus