శాటిలైట్ మార్కెట్ డౌన్ అయినట్లేనా?

ఒకప్పుడు శాటిలైట్ (Satellite) హక్కులు అంటే నిర్మాతలకు భారీ ఆదాయ వనరుగా ఉండేది. టీవీ ఛానెల్స్ ఓ పెద్ద సినిమా కోసం కోట్ల రూపాయల డీల్స్ కుదుర్చుకునేవి. ఒక సినిమా టీవీలో ఫస్ట్ టెలికాస్ట్ అంటే నిండుగా ప్రచారం చేసి, యాడ్స్ తో హడావుడి చేసి, టీఆర్పీలను బలంగా రాబట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఓటీటీ రాకతో టీవీ ప్రసారాల క్రేజ్ క్రమంగా తగ్గిపోయింది. థియేటర్ మిస్ అయితే వెంటనే ఓటీటీలో చూడగలిగే అవకాశం ఉండటంతో టీవీలో కొత్త సినిమాలు ప్రసారమైనా ప్రేక్షకులు ఆసక్తి చూపడం తగ్గిపోయింది.

Satellite

తాజాగా ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాను టీవీలో ప్రసారం చేసినప్పటికీ కేవలం 12 టీఆర్పీ మాత్రమే వచ్చింది. గతంలో అల్లు అర్జున్ సినిమాలకు 20కి పైగా టీఆర్పీలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన పుష్ప 2కి కూడా అలా రాకపోవడం, శాటిలైట్ మార్కెట్ ఎంత దిగజారిందో నిరూపిస్తోంది. ప్రస్తుతం కొత్త సినిమాల శాటిలైట్ హక్కుల విలువ కూడా భారీగా పడిపోయింది. ఓటీటీ డీల్స్ భారీగా వస్తున్న కారణంగా, శాటిలైట్ చానల్స్ కనీస ఆఫర్స్ ఇవ్వడానికే మొహమాట పడుతున్నాయి.

కొన్ని సినిమాలు, డిజిటల్ హక్కుల మోతాదు చూసి శాటిలైట్ (Satellite) హక్కులు కేవలం సింపుల్ ఫామ్ యాడ్ డీల్ మాదిరిగా ఫైనల్ అవుతున్నాయి. టీవీ ప్రేక్షకులు ఇప్పుడు సినిమాలు ఒక ఫిక్స్‌డ్ టైమ్‌లో చూసే అలవాటు కోల్పోవడం, యాడ్స్ బ్రేక్‌లతో ఇంటరెస్ట్ తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణాలు. సాధారణంగా థియేటర్ రిలీజ్ తర్వాత మూడు నెలల వ్యవధిలో సినిమాలు ఓటీటీలో వస్తున్నాయి. ఓటీటీలో సినిమాను ఎప్పుడైనా, ఎక్కడైనా, యాడ్స్ లేకుండా చూడగలిగే ఫ్లెక్సిబిలిటీ అందుబాటులో ఉండటంతో టీవీ స్క్రీనింగ్‌కు ప్రేక్షకులు పెద్దగా ఆకర్షితులవడంలేదు.

ఇది టీఆర్పీ రేటింగ్స్‌పై నేరుగా ప్రభావం చూపుతోంది. ఇందువల్ల నిర్మాతలు కూడా ఇప్పుడు శాటిలైట్ (Satellite) రైట్స్ విషయంలో ప్రత్యేకంగా డీల్స్ చేయకుండా, ఓటీటీ హక్కుల్లోపలే వాటిని కవరే చేయాలని చూస్తున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు శాటిలైట్ మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడకుండా ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టాయి. మొత్తానికి పుష్ప 2 టీఆర్పీ ఫలితం.. శాటిలైట్ మార్కెట్ పరిస్థితి ఎంత పతనమైందో స్పష్టంగా చూపిస్తోంది.

స్టార్ హీరోల మద్య సఖ్యత.. వెండి తెరపై బిగ్ మల్టీస్టారర్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus