స్టార్ హీరోల మద్య సఖ్యత.. వెండి తెరపై బిగ్ మల్టీస్టారర్స్!

టాలీవుడ్‌లో సినిమా మేకింగ్ మాదిరిగానే స్టార్ హీరోల (Star Heroes) మద్య రిలేషన్స్ కూడా కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ కనిపించడమంటే ఆశ్చర్యం కలిగించేదీ. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ఇది సాధారణం అయిపోయింది. మల్టీస్టారర్ సినిమాలు మామూలు విషయంగా మారిపోయాయి. ముఖ్యంగా టాప్ హీరోల మద్య సహకారం పెరిగిపోతోంది. ఈ ట్రెండ్‌లో తాజాగా భారీ స్థాయిలో కాంబినేషన్లు రెడీ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  ప్రధాన పాత్రలో అనీల్ రావిపూడి (Anil Ravipudi)  డైరెక్షన్‌లో వస్తున్న కొత్త సినిమాలో విక్టరీ వెంకటేష్ (Venkatesh)  కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

Star Heroes

ఇక రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ‘కూలీ’ (Coolie) సినిమాలో కూడా మరో హై వోల్టేజ్ కాంబినేషన్ నడుస్తోంది. ఇందులో ఉపేంద్ర (Upendra), నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలు పోషిస్తున్నారు. అదే రజనీ లైనప్‌లో ఉన్న మరో సినిమా ‘జైలర్ 2’ (Jailer)  లోనూ స్టార్ కాస్టింగ్ బలంగా ఉంది. శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) , మోహన్ లాల్ (Mohanlal)  , బాలకృష్ణ (Nandamuri Balakrishna), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) వంటి స్టార్లు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇలా తక్కువ టైమ్‌లో అంతమంది స్టార్ హీరోలు ఒకే సినిమాకు పనిచేయడం విశేషం.

ఇదే విధంగా ‘సలార్ 2’లో మళ్లీ మలయాళ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)  ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ‘కల్కి 2898’లో  (Kalki 2898 AD ) ప్రబాస్‌తో (Prabhas)  కలిసి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)  నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కల్కి 2’లోనూ ఆయన ప్రయాణం కొనసాగనుంది. మరోవైపు బాలీవుడ్‌లో ఎన్టీఆర్ (Jr NTR)  ‘వార్ 2’లో (War 2) హృతిక్ రోషన్‌తో  (Hrithik Roshan)  కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. హీరో పాత్ర కాకపోయినా కథలో కీలకమైన పాత్రకు ఓకే చెప్పి ఎన్టీఆర్ ముందుకు సాగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ టాప్ హీరోలు (Star Heroes) కూడా కలిసి మల్టీస్టారర్ ట్రెండ్‌ను మరింత గట్టిగా నిలబెడుతున్నారు. హీరోల మద్య పెరుగుతున్న ఈ మ్యూచువల్ సపోర్ట్ సినిమాల స్థాయిని రెట్టింపు చేస్తోంది. ఈ కలయికల వల్ల ప్రేక్షకులకు మాత్రం అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus