Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

ఎప్పుడో పదేళ్ల నాటి సినిమాలను ఇప్పుడు రిరిలీజ్‌లు చేసి హిట్‌లు కొడుతున్న ఇండస్ట్రీలు మనవి. అంతేకాదు పదేళ్ల క్రితం షూటింగ్‌ పూర్తై, విడుదలకు సిద్ధమై ఆగిపోయిన సినిమాలు కూడా రిలీజ్‌ అవుతున్నాయి. అలా రిలీజ్‌ అయి హిట్‌లు కూడా కొడుతున్నాయి. అలా వచ్చి విజయం సాధించిన సినిమా ‘మద గజ రాజా’. విశాల్‌ నటించిన ఈ సినిమా 12 ఏళ్ల తర్వాత వచ్చి భారీ విజయమే అందుకుంది. ఇప్పుడు మరో సినిమా పదేళ్లపాటు ఆగిపోయి ఇప్పుడు విడుదలవుతోందని సమాచారం.

Saturanga Vettai 2

అరవింద్‌ స్వామి, త్రిష జంటగా రూపొందిన చిత్రం ‘శతురంగ వేట్టై 2’. ఎప్పుడో 2014లో రూపొందిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల విడుదల కాకుండా ఆగిపోయింది. నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హెచ్‌.వినోద్‌ కథ అందించారు. ఆయనే తెరకెక్కించిన ‘శతురంగ వేట్టై’ సినిమాకు హెచ్‌.వినోదే దర్శకుడు కావడం గమనార్హం. ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేసి త్రిష క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో ఉన్నారట నిర్మాతలు.

మరి అనుకున్నట్టుగా సినిమాను రిలీజ్‌ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇలాగే ‘ధృవనక్షత్రం’ సినిమాను రిలీజ్‌ చేయాలని చాలా ఏళ్లుగా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌, హీరో విక్రమ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవ్వడం లేదు. మరి ‘శతురంగ వేట్టై 2’ ఏమవుతుందో చూడాలి. ఇక త్రిష క్రేజ్‌ విషయానికొస్తే.. ప్రముఖ ఆమె రాజకీయ కారణాల వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు సన్నిహితురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు త్రిష తన హీరోలకు వరుసగా విజయాలు ఇచ్చే పనిలో ఉందని అనిపిస్తోంది. ‘విదామయుర్చి’, ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’, ‘కరుప్పు’ సినిమాలతో ఆయా హీరోలకు విజయాలు దక్కాయి. నెక్స్ట్‌ ఆ అవకాశం ‘విశ్వంభర’ ద్వారా చిరంజీవికి ఇస్తుందేమో చూడాలి.

లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus