Satya Dev: సత్యదేవ్ కూడా బిజినెస్మెన్ అయిపోయాడు..!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ ఫార్ములాని మన టాలీవుడ్ హీరోలు కరెక్ట్ గా అప్లై చేస్తున్నారు అని చెప్పాలి. సాధారణంగా బ్రాండ్ అంబాసిడర్ గా చేసే అవకాశాలు ఎక్కువగా స్టార్ హీరోలకి మాత్రమే వస్తుంటాయి. కానీ ఈ మధ్య ప్రోడక్ట్ కి తగ్గ పర్సనాలిటీ కలిగిన, లేదంటే టాలెంట్ కలిగిన.. హీరోలు ఎవరున్నా సరే.. వారిని తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటున్నాయి కొన్ని సంస్థలు. మొన్నటికి మొన్న పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కొడుకు ఆకాష్ పూరీ (Akash Puri) కూడా ఓ క్లోతింగ్ బ్రాండ్ కి ని ప్రమోట్ చేసేందుకు ఎంపికయ్యాడు.

ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో కమ్ విలక్షణ నటుడు అయినటువంటి సత్యదేవ్ (Satya Dev) కూడా ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు ఎంపికయ్యాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీ చక్ర మిల్క్ ప్రొడక్ట్స్ ఎల్ ఎల్ పి బ్రాండ్ ని ప్రమోట్ చేసేందుకు హీరో సత్యదేవ్ రెడీ అయ్యాడు. శ్రీ చక్ర మిల్క్ ప్రొడక్ట్స్ ని తెలుగు రాష్ట్రాల్లో ప్రమోట్ చేసేందుకు గాను ఆ సంస్థ ఇతన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. సత్యదేవ్ కి ఉన్న మేజర్ ప్లస్ పాయింట్ అతని వాయిస్.

అతని డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుంది. అందువల్లే అనుకుంట బోలెడన్ని ఆఫర్లు అతన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక ఈ ఏడాది ‘కృష్ణమ్మ’ (Krishnamma) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. ఆ చిత్రంతో కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇంకో 2 సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు సత్యదేవ్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus