సత్యదేవ్ కు పూరీ బాగానే హెల్ప్ చేస్తున్నాడే..!

‘ముకుంద’ ‘జ్యోతిలక్ష్మీ’ ‘క్షణం’ ‘ఘాజీ’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ‘అంతరిక్షం’ వంటి విభిన్న చిత్రాల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు సత్యదేవ్. ఒక పక్క క్యారెక్టర్ ఆర్టిస్టు గా చేస్తూనే మరో పక్క హీరోగా కూడా చేస్తూ రాణిస్తున్నాడు సత్యదేవ్. తాజాగా సత్యదేవ్ నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రం డిసెంబర్ 28 న విడుదల కాబోతుంది. తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన ‘శతురంగ వెట్టై’ అనే చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంలో నందిత శ్వేతా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్లకు మంచి స్పందన రావడంతో.. ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రం తన కెరీర్ ను మార్చేస్తుందని అతను ధీమా వ్యక్తం చేస్తున్నాడు సత్యదేవ్.ఈ చిత్ర ప్రమోషన్ల భాగంగా సత్యదేవ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ‘బ్లఫ్ మాస్టర్’ విడుదల కాకముందే బాలీవుడ్ లో నటించే అవకాశం దక్కిందని సత్యదేవ్ తెలిపాడు. టెర్రరిజం కథాంశంతో సాగే ఓ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు సత్యదేవ్ చెప్పుకొచ్చాడు.

సత్యదేవ్.. ఇంత తొందరగా బాలీవుడ్ అవకాశం దక్కించుకోవడం పై ఇప్పుడు ఫిలింనగర్లో చర్చనీయాంశం అయ్యింది. సత్యదేవ్ కు ఈ అవకాశం రావడం వెనుక దర్శకుడు పూరి జగన్నాథ్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. గురువు రాంగోపాల్ వర్మ లాగే బాలీవుడ్లో మంచి సర్కిల్ ఉంది పూరికి. గతంలో అమితాబ్ తో ‘బుడ్డా హోగా తేరీ బాప్’ అనే చిత్రాన్నికూడా పూరి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాతో సత్యను ఇంట్రడ్యూస్ చేసింది కూడా పూరీనే కావడం గమనార్హం. ఇక ‘బ్లఫ్ మాస్టర్’ తో పాటూ మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టాడట సత్యదేవ్. ఇందులో ఒకటి ‘47 డేస్’ అనే థ్రిల్లర్ కాగా మరొకటి ‘గువ్వాగోరింకా’ అనే లవ్ స్టోరీ కావడం విశేషం. ఇవన్నీ చూస్తుంటే సత్యదేవ్ మంచి ఫామ్లోకి రావడం ఖాయమనిపిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus