కాజల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama). సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ‘గూఢచారి’ (Goodachari) , ‘మేజర్’ (Major) చిత్రాల దర్శకుడు శశికిరణ్ తిక్క (Sashi Kiran Tikka) సమర్పకులుగా వ్యవహరించారు. అంతేకాదు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ‘అవురమ్ ఆర్ట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. దీంతో ఉమెన్ సెంట్రిక్ మూవీ అయినప్పటికీ దీనికి థియేట్రికల్ బిజినెస్ ఓకే అనిపించే విధంగా జరిగింది అని చెప్పాలి.
ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 1.20 cr |
సీడెడ్ | 0.30 cr |
ఆంధ్ర(టోటల్) | 1.50 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.30 cr |
ఓవర్సీస్ | 0.20 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 3.50 cr |
‘సత్యభామ’ చిత్రానికి రూ.3.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.7 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చిన్నదేమీ కాదు. పైగా కాజల్ విమెన్ సెంట్రిక్ సినిమాలకి మార్కెట్ కూడా ఇంకా ఏర్పడలేదు. మౌత్ టాక్ బాగా వస్తేనే బ్రేక్ ఈవెన్ ఛాన్సులు ఉంటాయి. శశికిరణ్ తిక్కా, కాజల్..ల స్టార్ డం వల్ల నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో చాలా వరకు రికవరీ అయినట్లు ఇన్సైడ్ టాక్.